ఈనెల 9న జిల్లా కేంద్రంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన విజయవంతం చేయండి ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి
యాదాద్రి భువనగిరి జిల్లా: ఎమ్మార్పియాస్,యం యస్ పీ అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం ఈనెల 9న జిల్లా కేంద్రంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన విజయవంతం చేయండి ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే మాదిగలను మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని ఈరోజు స్థానిక రహదారి బంగ్లా లో ఎమ్మార్పీఎస్, యం యస్ పీ అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యం యస్ పీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ హాజరై మాట్లాడుతూ... ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా తీర్పును ఆగష్టు1న వెలువరించడం జరిగింది, తీర్పును ఇచ్చిన మరుక్షణమే నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ కి మరియు రాబోయే నోటిఫికేషన్ లో కూడా వర్గీకరణకి అనుగుణంగా ఉంటుందని, అలాగే గ్రూపు 1 & 2 మరియు మెడిసిన్ సీట్ల కేటాయింపు, విశ్వ విద్యాలయాల్లో సీట్ల కేటాయింపు, ప్రయివేటు రంగం లో కూడా వర్గీకరణ కి అనుగుణంగా చేస్తామని హామి ఇచ్చి ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాలలో 11,062 ఉపాధ్యాయ నియామకాల్లో వర్గీకరణ అనుగుణంగా న్యాయమైన వాటా 1200ల ఉద్యోగాలు మాదిగలు మరియు ఉపకులాలకి రావాల్సి ఉండగా కేవలం 200 మందికే ఉద్యోగాలు రావడం మరియు ఈ నెల 9న నియామక పత్రాలు ఇవ్వడం మాదిగలకు మరియు ఉపకులాలకి తీరని అన్యాయం చేసినట్టేనని అన్నారు. తక్షణమే నియామకాలు ఆపాలని, మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ కి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగల మరియు ఉపకూలాల ఆవేదనను తెలియజేసేందుకు ఎమ్మార్పియాస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 9న జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల నుండి జరిగే నిరసన ర్యాలీలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలతో పాటు డీఎస్సీలో వెనకబడ్డ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని మరియు ఈనెల 15వ తారీకున హైదరాబాద్ నగర కేంద్రంలో జరిగే ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఎస్సీల వర్గీకరణ లేకుండానే నియామకాలను నోటిఫికేషన్లు నిలిపివేయాలని లేకుంటే ఈ నెల 15 తర్వాత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిరంతర కార్యచరణ రూపంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండబెట్టడానికి కార్యాచరణ రూపొందించుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. -------------------------------------------- ఈ కార్యక్రమంలో యం యస్ పీ జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, ఎంఎస్పి జిల్లా నాయకులు దుబ్బ దానయ్య మాదిగ, జిల్లా కార్యదర్శి బోయ లింగ స్వామి, బండారు శివ శంకర్ మాదిగ , నారికడప నర్సింగ్ రావ్ మాదిగ,నల్ల స్వామి మాదిగ, మద్దూరి నర్సింగ్ రావ్ మాదిగ, మొగిలిపాక సత్తయ్య మాదిగ, మోత్కూపల్లి నవీన్ మాదిగ, కోయ సమ్మయ్య మాదిగ,కోళ్ల జహంగీర్ మాదిగ,గాయపాక పృథ్వీ మాదిగ, వాసాలమర్రి రవి మాదిగ,కొండగడప నరేష్ మాదిగ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Oct 07 2024, 17:26