బునాది గాని కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలి: CPI
బునాదిగాని కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐదు మండలాల కార్యదర్శుల, జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మండలం,మోత్కూరు, మోటకొండూరు,వలిగొండ, అడ్డగూడూరు మండలాల్లో బునాది కాల్వ పనుల ద్వారా త్రాగు సాగునీరు అందేలా బునాదికాలువ లో పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఆనాడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో వారు ప్రారంభిoచి కాల్వ ఎస్టిమేషన్ ప్రకారం14 కోట్లు కేటాయించినారు 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినంక రీ ఎస్టిమేషన్ వేసి 71 కోట్లు ప్రకటించి అందులో 31 కోట్లు విడుదల చేసినారు అందుకు పూర్తి కాకుండా నిలిచిపోయింది బునాది కాలువ పనులకు 269 కోట్ల నిధులతో పనులు పూర్తికావని, 400 కోట్ల వరకు బునాది కాల్వ పనులకు నిధులు పెంచాలని కోరారు. ఆత్మకూరు సిపిఐ మండల కార్యదర్శి మారుపాక వెంకటేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు,బోడ సుదర్శన్, కుస్మని హరిచంద్ర, వలిగొండ మండల కార్యదర్శి ,పోలేపాక యాదయ్య,మోటకొండూరు మండల సహ కారదర్శి ఆలేటి బాలరాజు,జిల్లా మహిళాసంఘo గౌరవ అధ్యక్షురాలు గుర్రం రాజమణి తదితరులు పాల్గొన్నారు.
Oct 03 2024, 19:47