NLG: విద్యార్థులు ఉన్నత లక్ష్యం చేరాలంటే కష్టపడి చదవాలి: ఎంఈఓ
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం యరగండ్ల పల్లి గ్రామంలో, పి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెడు వ్యసనాలకు బానిస కావొద్దు అని విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యం చేరాలంటే కష్టపడి చదవాలని, ఈరోజు శ్రమిస్తే రేపు భవిష్యత్ తరాలకు విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.
2003 - 2004 పూర్వ విద్యార్థుల సహకారం తో NMMS స్కాలర్షిప్ కోసం విద్యార్థులు పోటీపడి టాలెంట్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి.. పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.
విద్యార్థులు అవసరం కోసం
ఇక్కడ పాఠశాలలో పూర్వ విద్యార్థులుగా చదివి ఇప్పటి విద్యార్థుల కోసం బుక్స్ అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్స్ అందించడం అభినందనీయమని పూర్వ విద్యార్థులు అయిన 2003-2004 బ్యాచ్ విద్యార్థులు పాఠశాలను గుర్తుంచుకొని విద్యార్థుల కోసం ఇలాంటి ప్రోత్సాహాన్ని అందించడం అభినందనీయమని భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధి కోసం వారు మరింత తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.
జ్ఞానం అనే ఆయుధంతో ఈ సమాజాన్ని జయించాలి: పాండురంగారావు
పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండు రంగారావు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థిగా నేను ఈ పాఠశాలలో చదువుకొని నా మిత్రుల సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం చేయూతనందించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు విష సంస్కృతికి దూరంగా ఉండి లు కల్చర్ కు దూరంగా ఉండి బుక్ కల్చర్ను అలవాటు చేసుకోవాలని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను నమ్మకాలను వమ్ము చేయకుండా ఉండాలని, చెడు స్నేహాలను వీడి సమాజ మార్పు కోసం విద్యాభివృద్ధి దశలో జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, బాబాసాహెబ్ అంబేద్కర్, దేశం కోసం ప్రాణాలర్పించిన యువ కిశోరం భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని నవ సమాజ నిర్మాతలు గా, సమాజ మార్పు కోసం పాఠశాల అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధి కోసం విద్యార్థి దశ నుండే మంచి ప్రయత్నం చేయాలని అన్నారు.
అర్ధ నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు యువతను పెడదోవ పట్టించే విధంగా సినిమా కల్చర్, ర్యాగింగ్.. రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటి అరికట్టడంలో యువత విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, మనలను మనమే రక్షించుకోవాలని అందుకోసం జ్ఞానం అనే ఆయుధంతో ఈ సమాజాన్ని జయించాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు కోరారు.
విద్యార్థులకు జామెంట్రీ బాక్స్, NMMS బుక్స్ అవసరమని చెప్పగానే తక్షణమే స్పందించి సహకారాన్ని అందించిన పూర్వ విద్యార్థులందరికీ పి ఆర్ ఆర్ ఫౌండేషన్ మరియు పాఠశాల విద్యార్థుల పక్షాన ఆయన ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్తులో మా పూర్వ విద్యార్థులుగా మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలిపారు.
అనంతరం తన దగ్గర లేకున్నా పురోహితం చేసుకుంటూ పాఠశాల పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం సాయంత్రం తన సొంత డబ్బులతో స్నాక్స్ ను అందిస్తున్న మంచన హరిబాబు ను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాలతి ఉపాధ్యాయులు ఎం.మూర్తి, శ్రీనివాస్ రెడ్డి, ఉదయశ్రీ, జ్యోతి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Oct 01 2024, 19:23