NLG: డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలి:సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం గ్రామంలో సోమవారం సిపిఎం శాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ మహాసభకు మైల సత్తయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు, దేవరకొండ ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టులు సింగరాజుపల్లి, గొట్టిముక్కుల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు కొన్ని నిర్మాణ పనులు జరిగాయని, కానీ రైతాంగానికి ఉపయోగం లోకి సాగునీరు రావాలంటే డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను పర్యావరణ,అటవీ శాఖ అనుమతులు ఇచ్చి ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు కేటాయించి పనులు చేపట్టి,ఆ రిజర్వాయర్ల పరిధిలో ఉన్న రైతాంగానికి సాగునీరు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
జీవో ఎంఎస్ నెంబర్107 ద్వారా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఈ ప్రాంతానికి0.5 టీఎంసీ చొప్పున 60 రోజులు 30 టీఎంసీలు నీరు ఇవ్వనున్నట్లు జీవో ఇచ్చారని అనుమతులు మరిచారని ఆయన అన్నారు.
నల్లగొండ జిల్లాలో 3 లక్షల 41 వేల ఎకరాల ఆయ కట్టుకు నీరు ఇస్తానని చెప్పారు కానీ డిపిఆర్ ఆమోదించకపోవడం వలన డిండి ఎత్తిపోతల పథకం పనులు ముందుకు సాగడం లేదని ఆయన అన్నారు. ఏదుల్లా రిజర్వాయర్ నుండి మరో 27 కిలోమీటర్లు కాలువ తవ్వే పనికి అనుమతులు ఇవ్వలేదన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొచ్చి పది నెలలు అవుతున్నప్పటికీ ఇంకా దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. మునుగోడు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తిచేసి,ఈ ప్రాంత ప్రజలకు త్రాగునీరు- సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, గడగోటి వెంకటేష్, రుద్రాక్షి శ్రీరాములు, పిట్టల రమేష్, చొప్పరి హనుమంతు, గిరి విష్ణు, సురిగి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Oct 01 2024, 18:48