/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz సమాచార సేకరణ మహోత్సవం జరపాలి : కొడారి వెంకటేష్ ఆర్టిఐ యాక్టివిస్ట్ Vijay.S
సమాచార సేకరణ మహోత్సవం జరపాలి : కొడారి వెంకటేష్ ఆర్టిఐ యాక్టివిస్ట్


సమాచార హక్కు చట్టం-2005, ఏర్పడి రెండు దశాబ్దాలు అవుతున్న సందర్భంగా అక్టోబర్ మాసాన్ని "సమాచార సేకరణ మాసోత్సవంగా" జరపాలని ఆర్టీఐ ఆక్టివిస్ట్, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కోరారు. మంగళవారం భువనగిరి జిల్లా హెడ్ పోస్ట్ ఆఫీస్ లో మొదటి సమాచార దరఖాస్తును రిజిస్టర్ పోస్టు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమాచార హక్కు చట్టం -2005 , అక్టోబర్ 12 నుండి అమల్లోకి వచ్చిన సందర్భాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సహ కార్యకర్త లు అక్టోబర్ 1 నుండి 31 వరకు ప్రతి రోజు ఆయా ప్రభుత్వ శాఖలకు సమాచారం కోసం దరఖాస్తు చేసి, సమాచారాన్ని సేకరించాలని ఆయన పిలుపునిచ్చారు. పాలనలో పారదర్శకత జవాబుదారీతనం, మరియు అవినీతి రహిత సమాజం కోసం సమాచార హక్కు చట్టం -2005 ను పకడ్బందీగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గత 18 నెలలుగా ఖాళీగా ఉన్న సమాచార (చీప్ ) ప్రధాన కమీషనర్ మరియు సమాచార కమీషనర్ లను, అన్ని అర్హతలు ఉన్న వారిని యుద్ద ప్రాతిపదికన నియామకం చేయాలని ఆయన ముఖ్యమంత్రి ని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఆర్టీఐ ఆక్టివిస్ట్ గా చురుకైన పాత్ర పోషించారని, ఆర్టీఐ చట్టం -2005 ను సమర్థవంతంగా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వలిగొండ మండల కేంద్రంలో TUF నాయకులకు ఘన సన్మానం

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాళ్లకు సోమవారం వలిగొండ మండల కేంద్రంలోని టీయూఎఫ్ కార్యాలయంలో తాజా మాజీ రాష్ట్ర కార్యదర్శి జానకి రెడ్డి ఉమ్మడి జిల్లా తాజా మాజీ అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాజా మాజీ రాష్ట్ర కార్యదర్శి జానకి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరు అధర్య పడవద్దని. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతున్నదని నమ్మకం ఉందన్నారు ఈ కార్యక్రమనికి. వలిగొండ మండల ఉద్యమకారుల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు మారగొని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించగా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జోగు అంజయ్య యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షులు రాలు గంధ మల్ల. మల్లమ్మ . మల్లం వెంకటేశం.చౌటుప్పల్ మండల అధ్యక్షులు గట్టు సుధాకర్ రామన్నపేట టీయూఎఫ్..నాయకులు. బొడ్డుపల్లి లింగయ్య. ఎండి ఖలీల్ చీమకండ్ల శ్రీనివాస్ .ఇమామ్ .బాబు. ఎక్కల దేవి .శ్రీనివాస్.. పబ్బు లక్ష్మయ్య. గంగ దారి సత్తయ్య. గంధ మల్ల. గోపాలు. ఏ స్వామి మంటి లింగయ్య. ఐటిపాముల పుష్ప. కదిరే ని స్వామి.. కీర్తి కలమ్మ. నాగేల్లి రాములు. ఎదురుగట్ల రాములు. తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి 8వ వార్డులో హరితహారం ,మొక్కలు పంపిణీ చేసిన కౌన్సిలర్ పంగరెక్క స్వామి

భువనగిరి జిల్లాభువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టీ వెంకటేశ్వర్లు 8 వార్డు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా సోమవారం వార్డులో ఉన్న ప్రతి కుటుంబానికి ఆరు పూవుల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ..ఇంటికి ఓ చెట్టు ప్రగతికి మెట్టు అన్నారు. ప్రజలందరూ హరితహారంలో భాగం అయి వార్డుని హరితమయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయినా సబిత గోపాల్,వార్డ్ ఇన్చార్జి శబయొద్దిన్ ఆర్పీ,ధనలక్ష్మి,పావని,రమేష్ అనిత,మొగ్గ లక్ష్మి,వార్డు మహిళలు, మహిళల సంఘాలు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మందులు ల్యాబ్ లను ఏర్పాటు చేయాలి:AIYF జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్

వలిగొండ మండలంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24 గంటల అత్యవసర వైద్య సదుపాయాలు, కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక భువనగిరి శాసనసభ్యులకు వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ* గత పది సంవత్సర కాలం నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గత పాలకుల అండతో వైద్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తిస్ట వేసి ప్రజలకు సరైన వైద్యము అందించడం లేదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన మందులు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అలాగే సరైన ఆధునాతనమైన యంత్రాలు అందించి ల్యాబ్ టెక్నీషియన్ సెంటర్ లను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు వెంటనే మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బందిని ప్రక్షాళన చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి సుద్దాల సాయికుమార్, ఉన్నారు.
షరతులు లేని రెండు లక్షల రూపాయలు రుణమాఫీనీ రైతులందరికీ వెంటనే అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమం లో మాజీ ఎంఎ
ల్ఏ చిరుమర్తి లింగయ్య గారు ఈ సందర్భంగా మాజీ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్య గారు మాట్లాడుతూ ఋణ మాఫికి 18 వేల కోట్లు ఇచ్చినము,ఇంకా 13 వేలకోట్లు ఇవ్వాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు మిగిలిన రైతులకు డబ్బులు సమకూరే వెసులుబాటును బట్టి డేట్ ఇస్తాం అంటారు ఋణ మాఫీపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లోని రైతులందరికీ రుణమాఫీ చేశాం అని మాయ మాటలు చెప్తున్నారు ఒక్కో మంత్రి ఒక్కో రకంగా పొంతన లేకుండా సమాధానం చెప్తూ రైతులను మోసం చేస్తున్నారు అర్హులైన రాష్ట్రం లోని ప్రతి రైతుకు ఎటువంటి నిబంధలను లేకుండా రెండు లక్షల రూపాయల ఋణ మాఫీ చేయాలి రేషన్ కార్డులు లేవని రైతులకు రుణ మాఫీ చేయకపోవడం చాలా దుర్మార్గం వానాకాలం సీజన్ ముగుస్తున్న ఇంత వరకు రైతుబందు రైతుల అకౌంట్ల లో వేయలేదు,వెంటనే అందరికీ రైతు బంధు నిధులు వేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది ఆరు గ్యారంటీ లు అమలు చేయలేక హైడ్రా పేరుతో అమాయకుల ఇళ్లను పడగొడుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు ఈ ధర్నా కార్యక్రమం లో రామన్న పేట మండల పార్టీ నాయకుల,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


తెలంగాణ ప్రభుత్వం మూసి ప్రక్షాళనలకు శ్రీకారం చుట్టింది: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా యాంకర్ వాయిస్: తెలంగాణ ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వాను పరిశీలించి మాట్లాడారు. గత 40 ఏళ్లుగా మూసీని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో మూసీ కాలుష్యంతో బాధపడుతున్న మూసీ పరివాహక ప్రాంతం ప్రజలకి విముక్తి కలిగేలా సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. ప్రకృతి బాగుంటేనే సర్వ మానవాళి బాగుంటుందని అందుకే హైడ్రా రావాల్సిందేనని ఆయన అన్నారు. రైతులకు పంటల సాగుకు సాగునీరు అందేలా చర్యలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మూసి రివర్ కింద కబ్జాకు గురయినా ప్రాంతాలను తొలగించాల్సిందేనన్నారు.
విద్యార్థి దశనుండే ఉద్యమాల బాట పట్టిన శ్రీనివాస్ గౌడ్

వలిగొండ మండల కేంద్రానికి చెందిన మారగోని శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థి ఉద్యమ జేఏసీలో కీలకపాత్ర పోషించి జైలు జీవితం గడిపిన చరిత్ర కలదు శ్రీనివాస్ గౌడ్ ఉద్యమకాల ఫోరంలో గత మూడు సంవత్సరాల నుండి మండల అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మండలంలో ఉద్యమకారులు ఏకం చేసిన చరిత్ర కలదు శనివారం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ .ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్.చేతుల మీదుగా. శనివారం ఘనంగా సన్మానించి అతనికి గుర్తింపుగా. ప్రశంస పత్రం అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తాను ఉద్యమకారుల సమస్యలపై ఫోరం ఏ బాధ్యత అప్పజెప్పిన నా వంతుగా పనిచేశానని ప్రశంస పత్రం సన్మానం చేయడం పట్ల ఆయన రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్.కు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమ నాయకునికి సన్మానం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను గుర్తించాలని చేసిన పోరాటంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆరు సంవత్సరాల నుండి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా సమర్థవంతంగా బాధ్యతను నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈరోజు శనివారం గుర్తింపు పత్రం సన్మాన ప్రశంస పత్రం అందుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఉద్యమ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు నేతలు, ప్రజా సంఘాల నేతలు అభినందనలు తెలియజేశారు.
చిత్తాపురం లో జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో అనారోగ్యంతో ,అకస్మాత్తుగా చిన్న వయసులోనే మరణించిన సర్వి కిరణ్ కుమార్ (చింటూ )వారి కుటుంబానికి జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు
TPTF జిల్లా శాఖ ఆధ్వర్యంలో వలిగొండ MEO సుంకోజు భాస్కర్ కి సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో టిపిటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వలిగొండ ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన సుంకోజు భాస్కర్ ని శుక్రవారం ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ కుమార్ మరియు బొక్క వెంకట్ రెడ్డి ,బి లింగయ్య, ఆర్ వీరస్వామి, ఎస్ రాము పాల్గొన్నారు. అనంతరం టి పి టి ఎఫ్ క్యాంపెనింగ్ లో భాగంగా వలిగొండ మండలంలోని వివిధ పాఠశాలను సందర్శించారు.