షరతులు లేని రెండు లక్షల రూపాయలు రుణమాఫీనీ రైతులందరికీ వెంటనే అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమం లో మాజీ ఎంఎ
ల్ఏ చిరుమర్తి లింగయ్య గారు ఈ సందర్భంగా మాజీ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్య గారు మాట్లాడుతూ ఋణ మాఫికి 18 వేల కోట్లు ఇచ్చినము,ఇంకా 13 వేలకోట్లు ఇవ్వాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు మిగిలిన రైతులకు డబ్బులు సమకూరే వెసులుబాటును బట్టి డేట్ ఇస్తాం అంటారు ఋణ మాఫీపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లోని రైతులందరికీ రుణమాఫీ చేశాం అని మాయ మాటలు చెప్తున్నారు ఒక్కో మంత్రి ఒక్కో రకంగా పొంతన లేకుండా సమాధానం చెప్తూ రైతులను మోసం చేస్తున్నారు అర్హులైన రాష్ట్రం లోని ప్రతి రైతుకు ఎటువంటి నిబంధలను లేకుండా రెండు లక్షల రూపాయల ఋణ మాఫీ చేయాలి రేషన్ కార్డులు లేవని రైతులకు రుణ మాఫీ చేయకపోవడం చాలా దుర్మార్గం వానాకాలం సీజన్ ముగుస్తున్న ఇంత వరకు రైతుబందు రైతుల అకౌంట్ల లో వేయలేదు,వెంటనే అందరికీ రైతు బంధు నిధులు వేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది ఆరు గ్యారంటీ లు అమలు చేయలేక హైడ్రా పేరుతో అమాయకుల ఇళ్లను పడగొడుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు ఈ ధర్నా కార్యక్రమం లో రామన్న పేట మండల పార్టీ నాయకుల,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Sep 30 2024, 17:40