నాంపల్లి: చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకంమని బలహీనవర్గాల కులంలో పుట్టి కూడా ఆమె చూపించిన తెగువ గొప్పది అన్నారు.
నాంపల్లి మండల కేంద్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకొస్తున్నాని, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ ఇంకొందరికి కాలేదు, త్వరలోనే రుణమాఫీ పూర్తి చేయిస్తామని తెలిపారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే త్వరలోనే ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇస్తామన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో బస్ స్టేషన్, బైపాస్, మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు డబల్ రోడ్లు నిర్మాణం చేపట్టామని ఎటువంటి కరెంటు సమస్య తలెత్తకుండా నియోజకవర్గానికి 57 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని నాంపల్లి మండలానికి చెప్పిన విధంగానే అభివృద్ధి చేసి చూపిస్తానని మునుగోడు నియోజకవర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన మాట నెరవేరుస్తానని అన్నారు.
33/11 సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నాంపల్లి మండలంలోని నర్సింహులగూడెం గ్రామ పరిధిలో 3 కోట్ల వ్యయంతో 33/11 సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, గజ్జల శివారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి, అంగిరేకుల పాండు, వీరమల్ల శ్వేతా నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గఫార్, కలకొండ దుర్గయ్య, ఎస్.కె చాంద్ పాషా, రవి నాయక్, దీప్లా నాయక్, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య, కోరే శివ, సుధన బోయిన శ్రీను, చత్రపతి, సైదాబీ, బట్టు జగన్, నా రోజు సైదాచారి, ఈదశేఖర్, బేకరీ గిరి, మేకల రమేష్ యాదవ్, మారేపాకుల రాములు, పూల యాదగిరి, ఈదశేఖర్, ఎదుళ్ల రాములు, గాదేపాక రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Sep 27 2024, 16:16