బీఆర్ఎస్ దూకుడు.. ఇవాళ ఉదయం 9 గంటలకు..
బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇటీవల జోరు పెంచిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ (బుధవారం) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీలో పర్యటించనున్నారు.
బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇటీవల జోరు పెంచిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ (బుధవారం) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలతో కలసి ఫతేనగర్‌కు కేటీఆర్ వెళ్లనున్నారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌టీపీ ప్లాంట్‌ను ఆయన పరిశీలించనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు ఆఫీస్‌లో జరగనున్న ప్రెస్ మీట్‌లో పాల్గొని మాట్లాడనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘‘ఎత్తు కుర్చీల్లో కూర్చోవడం కాదు-కన్నేత్తి రైతుల గోస చూడు ముఖ్యమంత్రి’’ అని మండిపడ్డారు. ‘‘మాఫీ కాని రుణమాఫీ- పత్తా లేని పాల బిల్లులు. వేస్తావన్న భరోసా లేని రైతు భరోసా - బోనస్ పేరుతో బోగస్ మాటలు. ఒకటా రెండా అన్నింట్లో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
రైతు రోడ్డెక్కితే జంకిన మీరు రూ.150 కోట్ల పాల బిల్లుల బకాయిలకు రూ.50 కోట్లు విడుదల ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. మీ పుణ్యమా అని ఈ దసరా రైతులకు మునపటి దసరాలా ఉండేలా లేదు. బోగస్ హామీలతో రైతుల గొంతు నొక్కి గద్దెనెక్కి ఎత్తు కుర్చీల్లో రాచరిక దర్పాన్ని ప్రదర్శిస్తున్న మీరు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు’’ అని కేటీఆర్ విమర్శించారు.
Sep 25 2024, 11:34