అట్టహాసంగా ఆలేరు వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం రోజు ఆలేరు లోని ఓ ఫంక్షన్ హల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ సహకార,చేనేత శాఖ,జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు,తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ,ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు శ్రీ బీర్ల ఐలయ్య గారు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ పచ్చి మట్ల మధారు గౌడ్, 13 మంది డైరెక్టర్ లచే ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు ఆలేరు పట్టణం లో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ పాలకవర్గం అధికారులు రైతులతోసమన్వయంతో ముందుకు సాగి రైతుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతులను రాజును చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రతి కార్యకర్త అధికారులతో సమన్వయాన్ని పాటించి ప్రజలకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు నూతన పాలక వర్గానికి అభినందనలు తెలిపారు.విజయవంతంగా సేవలు అందించి రైతుల సంక్షేమానికి కృషి చెయాలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో నల్గొండ,రంగారెడ్డి జిల్లాల మదర్ డైరి చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి,భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి, ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్లు, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, ముఖ్య నాయకులు మార్కెటింగ్, అగ్రికల్చర్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Sep 24 2024, 19:56