చేపల మృతిపై సమగ్ర విచారణ జరపాలి దుండగులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
చేపల మృతిపై సమగ్ర విచారణ జరపాలి దుండగులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి
ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
బెజ్జంకి మండల కేంద్రంలో
చేపల మృతికి కారకులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని రాష్ట్రముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో అక్కరవేణి పోచయ్యకు చెందిన చేపల చెరువులపై విష ప్రయోగం వలన చేపలు చనిపోగా విషయం తెలిసిన జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ చేపల చెరువును చేపలు చనిపోయిన వాటిని తన సంఘం సభ్యులతో కలసి పరిశీలించి చేపల రైతు అక్కెరవేన పోచయ్య ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులపై తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ముదిరాజ్ సంపదలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముదిరాజ్ లా స్వయంకృషితో చేపల చెరువులను నిర్మించుకొని సంపదను సృష్టించి ఆర్థికంగా ఎదిగే ప్రయత్నంలో ముదిరాజ్ లను ఆర్థికంగా మానసికంగా దెబ్బ తిస్తున్నరని అన్నారు. రాష్ట్రంలో అనేక గ్రామాల్లో నేటికీ ముదిరాజులను గ్రామ బహిష్కరణలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించ్చుకోవడం లేదని అన్నారు. ముదిరాజులపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చేపల సంపదపై చేసే దాడులపై ప్రభుత్వాలు ప్రత్యేక జీవోలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ హక్కుల సాధన సమితి యువత అధ్యక్షుడు పడిగే ప్రశాంత్ ముదిరాజ్ చిన్నకోడూరు మండల వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య. ముదిరాజ్ హక్కుల సాధన సమితి జిల్లా కన్వీనర్ రావుల రాజు ముదిరాజ్, ముదిరాజ్ హక్కుల సాధన సమిత జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పుప్పాల బాలేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ రావుల మొండయ్య ముదిరాజ్, తాటికొండ రాజేందర్ ముదిరాజ్, కొరివి తిరుపతి ముదిరాజ్, రావుల కనకయ్య ముదిరాజ్, రావుల మహేష్ ముదిరాజ్, రావుల ప్రశాంత్ ముదిరాజ్, జెట్టి అర్జున్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, జెట్టి రమేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Sep 24 2024, 19:48