/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: బొట్టుగూడ హైస్కూల్ లో ప్రజాపాలన దినోత్సవం Mane Praveen
NLG: బొట్టుగూడ హైస్కూల్ లో ప్రజాపాలన దినోత్సవం
నల్లగొండ: సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా స్థానిక బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని పాడారు.

ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. సీనియర్ ఉపాధ్యాయుడు డా. వై.శ్యాంసుందర్ రెడ్డి సెప్టెంబర్ 17 విశిష్టత, ఆపరేషన్ పోలో, పర్యవసానాలు, విజయాల గురించి విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
బాల గణేష్ యూత్ లడ్డు రూ. 25,000/-
నల్లగొండ జిల్లా
మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రులు పూజలందుకున్న గణనాధుని లడ్డు ను వేలం పాటలో రూ.25,000/- లకు గొడ్డెటి పెద్ది రాములు యాదవ్  కైవశం చేసుకోవడం జరిగింది. 

బాల గణేష్ యూత్ సభ్యులు వారిని శాలువా తో సన్మానించి, వారికి వారి కుటుంబ సభ్యులకు గణనాధుని ఆశీస్సులు ఎల్లవేళలా  ఉండాలని మనసారా  కోరుకున్నారు.
'యువతను చెడు నుండి మంచి వైపు మల్లెలా చూడాలి' : ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా, మునుగోడు:
యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండల నాయకులు, పోలీసులతో మండలంలోని గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్మూలన పై సమావేశం నిర్వహించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ..యువతను చెడు నుండి మంచి వైపు మల్లెలా చూడాలని నాయకులకు పోలీసులకు సూచించారు. నియోజకవర్గాన్ని గంజాయి డ్రగ్స్ రహిత, బెల్ట్ షాపు ల నిర్మూలన  నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం పనిచేయాలన్నారు.

గంజాయి, బెల్టు షాపు ల నిర్మూలనపై రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, ఈ రిజిస్టర్ లో ఏ ఏ గ్రామాలలో ఎంతమంది తాగుడుకు బానిసయ్యారు. ఎంతమంది యువత గంజాయి డ్రగ్స్ కి అలవాటు పడ్డారు అనే వివరాలు పొందుపరచాలని పోలీసులకు సూచించారు. ఈ రిజిస్టర్ మెయింటెనెన్స్ వల్ల గంజాయికి, డ్రగ్స్ కి, మద్యానికి బానిసలుగా మారిన వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా ఆ మత్తు నుండి బయటపడేసే విధంగా కార్యచరణ  రూపొందిస్తున్నామని తెలిపారు.

నియోజకవర్గాన్ని గంజాయి డ్రగ్స్ రహిత, బెల్ట్ షాపుల నిర్మూలన  నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం సరికొత్త ఆలోచనలతో కార్యాచరణ రూపొందించామన్నారు. ఆ కార్యాచరణ ప్రకారం నాయకులు పోలీసులు పనిచేయాలన్నారు.

ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశంలో నల్గొండ ఎక్సైజ్ సూపర్డెంట్ సంతోష్, చండూరు సీఐ కరుణ నాయక్, నాంపల్లి సీఐ సైదులు, చండూర్ ఎక్సైజ్ అధికారి స్వాతి పాల్గొన్నారు.
మేళ తాళాల నడుమ నాంపల్లి మండలంలో గణేష్ శోభాయాత్ర
నల్లగొండ జిల్లా:
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో నిర్వాహకులు కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నాంపల్లి మండల కేంద్రంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన వినాయక మండపాల లోని గణేషుడి శోభాయాత్ర.. సోమవారం ఏర్పాటు చేసిన గణేష్  మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదానాలు, శోభాయాత్ర సందర్భంగా స్వామి వారి శేష వస్త్రాలు, కలశం, లడ్డు ప్రసాదం తదితరాలను వేలం వేయగా భక్తులు పోటీపడి దక్కించుకున్నారు. అనంతరం  గణపతిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పై ఉంచి ఆలయ కమిటీ, పుర ప్రముఖులు మహిళల కోలాట ప్రదర్శన, మేళ తాళాల నడుమ నాంపల్లి పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. తదనంతరం జై జై గణేశా బై బై గణేశా అంటూ గుర్రంపొడు సాగర్ కాల్వలో నిమజ్జనం చేశారు.

ఈ కార్యక్రమంలో పానుగంటి వెంకటయ్య, జాల ముత్తయ్య, తిరుమణి మోహన్, ఎస్కే జాంగిర్, కాంశెట్టి ముత్యాలు, జాల సునీత, నాంపల్లి వెంకటమ్మ జాల సుష్మ దోనాల రేణుక నాంపల్లి కవిత కోనేటి లలిత, జువేద, పసుపులేటి అలివేలు, నాంపల్లి భిక్షం, అమ్మోదు కోటమ్మ, బా లకృష్ణయ్య, పసుపులేటి గిరి, నాంపల్లి యాదయ్య, కమిశెట్టి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: మహాలక్ష్మి రెసిడెన్సి గణేష్ లడ్డూను రూ. 18,116/- లకు వేలంపాటలో పొందిన బొమ్మపాల గిరిబాబు
నల్గొండ పట్టణంలోని కనకదుర్గ కాలనీ మహాలక్ష్మి రెసిడెన్సిలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డు వేలంపాటలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు రూ. 18,116/- లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
లెంకలపల్లి: వైభవంగా గణేష్ శోభాయాత్ర

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామం లో గణేష్ శోభాయాత్ర ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరిగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, పలు కాలనీలలో ఏర్పాటుచేసిన వినాయకుడి లకు.. భక్తిశ్రద్ధలతో 9 రోజులు పూజలు నిర్వహించారు.

ఆదివారం కోలాటం ఆటలు పాటలతో శోభాయాత్ర ను ఘనంగా నిర్వహించి, వెళ్లి రావయ్యా.. గణపయ్య.. మళ్ళీ వచ్చే సంవత్సరం నీ ఆశీస్సులతో ఇంతకంటే వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతామని, నిమజ్జనం సందర్భంగా ఆ గణనాధుని గంగమ్మ తల్లి ఒడికి చేర్చారు.

NLG: గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అన్నదానం
నల్లగొండ జిల్లా:
నాంపల్లి: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం వినాయకుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

నాంపల్లి ఎస్బిఐ కార్యాలయం ముందు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాత బిరుదు యాదమ్మ రవీందరాచారి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కోట ప్రమీల రఘునందన్, అల్లం పెళ్లి ఆనంద్ కుమార్, గంగ, మహేష్, గిరి, స్వామి, భారతమ్మ ప్రమీల,  కిరణ్, రూప, శేఖర్, పవిత్ర, బ్రహ్మచారి రమాదేవి, జయశ్రీ, అనుష, తదితరులు పాల్గొన్నారు.
యరగండ్లపల్లి: ఎనబై ఐదు వేల రూపాయలు పలికిన గణేష్ లడ్డు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం:

ఈరోజు యరగండ్లపల్లి గ్రామంలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో నవరాత్రులు పూజలందుకున్న గణనాధుని లడ్డు వేలం పాట జరిగింది.

రూ. 85,000/- ఎనబై ఐదు వేల రూపాయలకు వల్లముల సత్తమ్మ యాదయ్య యాదవ్ లడ్డును కైవశం చేసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా యువ చైతన్య యూత్ సభ్యులు వారిని శాలువాతో సన్మానించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు గణనాధుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకున్నారు.

NLG: మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన కుంభం కృష్ణారెడ్డి
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండల కేంద్రానికి చెందిన జింకల చిన్న యాదయ్య మృతి చెందిన సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి మృతి చెందిన జింకల చిన్న యాదయ్య భౌతికకాయానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబం సభ్యులను పరామర్శించి వాళ్లకి మనో ధైర్యం చెప్పి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.10,000 అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య, పూల చిన్న వెంకటయ్య, పంగ కొండయ్య, నాంపల్లి హనుమంతు, పూల చక్రధర్, ఈదే శేఖర్, ఏదుళ్ల రాములు, గాదేపాక రమేష్, కానబోయిన యాదయ్య, నాంపల్లి సంజీవ, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ నేత కీ. శే. జిట్టా బాలకృష్ణ రెడ్డి కి నివాళులర్పించిన మునుగోడు ఎమ్మెల్యే
భువనగిరి:
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. ఇవాళ భువనగిరి పట్టణంలో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి  దశదినకర్మకు హాజరై, ఆయన చిత్రపటానికి పూల మాలలు సమర్పించి నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు  కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.