NLG: వినాయక మండపం వద్ద భక్తులకు అన్నదానం- విగ్రహ దాత కు ఘన సన్మానం
నల్లగొండ జిల్లా:
నాంపల్లి: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో ఎనిమిదవ రోజు శనివారం ఆయా మండపాల వద్ద భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల శివారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపాల వద్ద వినాయకునికి పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు.కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గజ్జల శివారెడ్డి కి ఘనంగా సన్మానం
అనంతరం భక్తులు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గజ్జల శివారెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రవళి పూర్ణాచారి, పానుగంటి వెంకటయ్య, ఎస్కే చాంద్ పాషా, కామిశెట్టి చత్రపతి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, గిరి ముదిరాజ్, కంశెట్టి నాగరాజు, బేల్డి సత్తయ్య, గాదేపాక శ్రీకాంత్, జాల ముత్యాలు, నాంపల్లి సంజీవ, మోహన్ రెడ్డి, సురేందర్, కోరే శివ, కోరే జయరాం, ఎస్కే జాంగిర్, తిరుమణి మోహన్, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా:
కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గజ్జల శివారెడ్డి కి ఘనంగా సన్మానం

నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ లో హిందీ దివస్ కార్యక్రమాన్ని శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. హిందీ భాష దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా హిందీ భాషలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
నల్లగొండ పట్టణ కేంద్రంలోని 33 వ వార్డులో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద వినాయకుడి శనివారం 8 వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 33 వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య రెడ్డి పాల్గొని వినాయకుడికి ప్రత్యెక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త హానికరమైన చెత్తను వేరు చేయాలని సూచించారు. అదేవిధంగా చెత్త సేకరణ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ నాగుల జ్యోతి, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా:
శనివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. భారత ప్రజానీకానికి, శ్రామిక వర్గానికి కామ్రేడ్ సీతారాం ఏచూరి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
నల్లగొండ జిల్లా:
అనంతరం ప్రసాదము స్వీకరించి యువ చైతన్య యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బు సంపాదించాలని బైకులను దొంగతనం చేసి, ఆ డబ్బుతో జల్సాలకు పాల్పడుతున్న ఏపీ మాచర్ల కు చెందిన రాజా అనే అంతరాష్ట్ర బైక్ దొంగను కొండ మల్లేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు.
కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి సమయాలలో రెండు పల్సర్ బైక్ లను దొంగ కొట్టేశాడని, సీసీ కెమెరాల ద్వారా నిందితుని గుర్తించడం జరిగిందని తెలిపారు.
నల్లగొండ జిల్లా:
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పగిల్ల రమేష్ రేణుక దంపతులు 8 వ రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా:
అనంతరం వారు మాట్లాడుతూ.. ఆగస్టు 12, 1952లో మద్రాసులో జన్మించిన సీతారాం ఏచూరి 1974 లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐ లో ఎన్నికయ్యారు. 1975లో సిపిఎం పార్టీ సభ్యుడయ్యారు. పార్టీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయనకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నామన్నారు.
దేవరకొండ: ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో చిన్న కోళ్ల ఫామ్ ఎదుట ముందు జరిగిన ధర్నాకు అధికారులు స్పందించి పాఠశాలకు పరిశీలించడానికి వచ్చిన ఆర్డిఓ శ్రీరాములు, డీఎస్పీ గిరిబాబు లకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. దేవరకొండ ఆదర్శ పాఠశాలలో సుమారుగా 540 మంది విద్యార్థులు దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నారని విద్యార్థిని విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలలో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో స్థలం యొక్క యజమానులు కోళ్ల ఫారం ఏర్పాటు చేసి ఉంచడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు దుర్వావాసనతో విద్యార్థిని విద్యార్థులు అనారోగ్యం పాలై వాంతులు, విరోచనాలకు గురవుతున్నారని అన్నారు.
Sep 15 2024, 11:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.7k