'పేదల పక్షాన దేశస్థాయిలో గళం విప్పిన మహోన్నత వ్యక్తి సీతారాం ఏచూరి'
SB NEWS, నల్లగొండ జిల్లా:
కమ్యూనిస్ట్ సీనియర్ నాయకుడు రాజ్యసభ మాజీ సభ్యుడు, సిపిఎం జనరల్ సెక్రటరీ, పొలిటి బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరి మరణం బాధాకరం అని సిపిఎం మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్ అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో సీతారామ్ ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరంలోటని వారు పేర్కొన్నారు. 1952 లో మద్రాస్ లో జన్మించి ఢిల్లీ నేతగా ఎదిగారని, ఆయన పూర్తి పేరు ఏచూరి సీతారామారావు అని తెలిపారు.
జేఎన్ యు విద్యార్థి నాయకునిగా మూడుసార్లు ఎన్నికయ్యారని,1985 లో కమ్యూనిస్టు పార్టీ కింద కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని, 1999 లో పొలిటి బ్యూరో సభ్యునిగా చోటు దక్కించుకున్నారని అన్నారు. 2005 లో తొలిసారిగా బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని, 2015, 2018,2022 లో మూడుసార్లు పార్టీ జాతీయ కార్యదర్శిగా పని చేశారని వారు పేర్కొన్నారు.
తన జీవితాన్ని అంతా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల కోసం దార పోసి, సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా, ఆర్థిక అసమానతల పై పోరాడుతూ.. పేదల పక్షాన దేశస్థాయిలో గళం విప్పిన మహోన్నత వ్యక్తి ఏచూరి.. అని వారు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం రాములు, కకునూరు నగేష్, కర్నాటి వెంకటేశం, కర్నాటి యాదయ్య, ముసుకు బుచ్చిరెడ్డి, పెద్దగాని నరసింహ, మొద్దు గాలయ్య, పసుపుల చెన్నయ్య, నల్లవెల్లి బిక్షం, జి.విశ్వనాథం, ఖమ్మం అబ్బయ్య, ఖమ్మం నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Sep 14 2024, 21:47