NLG: వైద్యం వికటించి వ్యక్తి చనిపోయాడని, ఆస్పత్రి పై విచారణ చేపట్టి.. న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
నల్గొండ కలెక్టరేట్:
దేవరకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న వైద్య సేవల పై విచారణ జరపాలని, వైద్యం వికటించి తన తండ్రి చనిపోయాడని ఆరోపిస్తూ.. తనకు న్యాయం చేయాలని బాధిత కుటుబీకుడు బుర్రి వెంకన్న జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
పిఏ పల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన బాధిత కుటుంబీకుడు బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. సంజీవి ని హాస్పిటల్లో డాక్టర్స్ బుర్రి మట్టయ్య అను తన తండ్రి కి సక్రమంగా వైద్య సేవలు అందించలేదని, వైద్య సేవల లోపం వల్ల, ఆపరేషన్ వికటించి ఇన్ఫెక్షన్ అయినందున మరణించాడని, తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు పేద ప్రజలకు వరం లాంటిది, కానీ ఆరోగ్యశ్రీ సేవలలో పేదలకు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఇంటికి పంపిస్తున్నారని వాపోయారు. ఇటీవల దుగ్యాల గ్రామానికి చెందిన బుర్రి మట్టయ్య తన తండ్రి కి తుంటి వద్ద కాళు కు ఆరోగ్యశ్రీ ద్వారా దేవరకొండ లోని ప్రవేట్ హాస్పటల్లో ఆపరేషన్ చేయడం జరిగిందని.. కానీ ఆపరేషన్ ల్యాబ్ లో వాడిన పరికరాల ప్రాబ్లమా, ల్యాబ్ లో పరిశుభ్రత ప్రాబ్లమా ఏమో గానీ, వైద్యం వికటించి అనారోగ్య పాలై ఆపరేషన్ చేసిన 20 రోజులకే మరణించడం జరిగిందని చెప్పారు.
ఇప్పటికైనా పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ అయ్యే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా లేదా ఒకసారి పరిశీలించ వలసిందిగా, ఆస్పత్రి ద్వారా జరిగినటువంటి ఈ నిర్లక్ష్యపు ఆపరేషన్ వైద్యం పై విచారణ జరపాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం ఇష్టానుసారంగా ఆపరేషన్ చేయొద్దని ఇలాంటి హాస్పిటల్ పైన జిల్లా యంత్రాంగం విచారణ చేయాలని పేదలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మెరుగైన సేవలు అందించి ప్రజల ప్రాణాలను వారు కాపాడాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తగు న్యాయం చేయాలని ఆస్పత్రి వివరాలు కలెక్టర్ కు తెలిపారు.
ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తానని తన కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పత్రికముఖంగా చట్టబద్ధంగా ఆ ఆస్పత్రి యాజమాన్యం పైన న్యాయ పోరాటం చేస్తానన్నారు.సంబంధిత జిల్లా అధికారులు విచారణ జరిపి, తన కుటుంబాన్ని ఆదుకోవాలని బుర్రి వెంకన్న అన్నారు.
Sep 10 2024, 21:33