కొరివి కృష్ణ స్వామి గారి స్పూర్తితో ముదిరాజ్ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలి! మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
కృష్ణస్వామి గారి స్ఫూర్తితో ముదిరాజ్ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలి.
ముదిరాజ్ రిజర్వేషన్ కు సహకరిస్తాం.
ఈ చౌరస్తాను కృష్ణ స్వామి జంక్షన్ గా ప్రకటిస్తున్నాం
సిద్దిపేటలో ముదిరాజ్లకు స్థానిక సంస్థల్లో,రాజకీయంగా పదవులతో గౌరవించుకున్నాం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల మంది మత్స్యకారులకు నూతన సభ్యత్వం ఇచ్చాం.
ముదిరాజుల రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి బిఆర్ఎస్ సహకరిస్తుంది
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
సిద్దిపేట పట్టణంలో ముస్తాబాద్ రోడ్డులో కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ముదిరాజ్ సమాజ్ సభ్యులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ:
హైదరాబాద్ తొలి మేయర్ గా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారు నగరానికి ఎంతో సేవలు అందించారు.
వారి అడుగుజాడల్లో ముదిరాజ్ సమాజం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
ముదిరాజ్ సమాజం నుంచి సిద్దిపేటలో సర్పంచులుగా, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లుగా అనేక పదవుల్లో ముదిరాజులను గౌరవించుకున్నాం.
రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించుకున్నాం.
అదేవిధంగా ప్రతి గ్రామంలో ముదిరాజ్ ఆత్మ గౌరవ భవనాలు ఉన్న నియోజకవర్గం సిద్దిపేట ఒకటే.
ముదిరాజ్ రిజర్వేషన్ కు బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది.
మత్స్యకారులకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కొత్త సభ్యత్వ కార్డులను మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ముదిరాజులు కృష్ణ స్వామి గారి మార్గంలో ఐక్యంగా ముందుకు సాగాలని, వారి విగ్రహాన్ని చూసినప్పుడు మరింత స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను.
ఈ చౌరస్తాని కృష్ణస్వామి జంక్షన్ గా ఏర్పాటు చేస్తాం.
ఈ కార్యక్రమంలో కెకెఎస్ సేవసమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నగేష్ ముదిరాజ్
తోడేటి సత్యం,
ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కొట్టాల యాదగిరి ముదిరాజ్, పడిగె ప్రశాంత్, మేడికాయల వెంకటేశం, కీసరి పాపయ్య, సీసల శ్రీనివాస్, సుతారి రాజు, పుల్లూర్ సుధాకర్, రామకృష్ణ ముదిరాజ్, బోనాల శ్రీనివాస్, బైరి యాదగిరి, తోట్ల పర్శరాములు కొంతం శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
Sep 07 2024, 17:20