NLG: సిఐటియు ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
ఆశా డే సందర్భంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని, శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో మర్రిగూడ మండల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ కు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశలకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆశాలు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ స్కీం లో పనిచేసే ఆశాలు దళిత, బలహీన వర్గాలకు చెందిన వారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఆశలను కార్మికులుగా గుర్తించాలి, గ్రాడ్యుటీ మరియు పెన్షన్తో సహా అన్ని సామాజిక భద్రత ప్రయోజనాలకు నెలకు పదివేల రూపాయల కంటే తక్కువ కాకుండా చెల్లించాలి.అన్ని రకాల పెండింగ్ బిల్లు లు తక్షణమే చెల్లించాలి. ఆశా లకు పనిభారం తగ్గించాలి. పారితోషకం లేని పనులు చేయించ కూడదని అన్నారు.
అదేవిధంగా అంగన్వాడీ లకు గ్రేడ్ వర్జింపజేసి ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును స్కీం వర్కర్ లో భాగమైన ఆశలకు వర్తింపచేయాలని ఆరు నెలల వేతనంతో కూడిన ప్రస్తుత సెలవులు అమలు చేయాలని, 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని, మెడికల్ సెలవుల కోసం కచ్చితంగా నిబంధనలు రూపొందించాలని, అదేవిధంగా విధుల కోసం ఆశలకు ప్రయాణ ఖర్చులను వాస్తవ రూపంలో చెల్లించాలి. లేబర్ కోడ్స్ ను ఉపసంహరించుకోవాలి. ఆశలను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జంపాల వసంత, మట్టం భాగ్యమ్మ ఏర్పుల పద్మ, ఊరిపక్క మేరీ, అందుగుల యాదమ్మ, రామావత్ జయమ్మ, లక్ష్మి, విజయమ్మ , సుజాత తదితరులు పాల్గొన్నారు.
Sep 07 2024, 08:34