NLG: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: సీఐ రాజశేఖర్ రెడ్డి
నల్లగొండ: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం, డీఎస్పీ శివరాం రెడ్డి సూచనల మేరకు, నేడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గణేష్ మండప నిర్వాహకులతో, పోలీసులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పలు సూచనలు చేశారు.
1) ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు ప్రతి విగ్రహాన్ని విధిగా ఆన్లైన్ చేసుకోవాలని, ప్రతి విగ్రహానికి పోలీస్ వారి నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని విగ్రహాన్ని ఆన్లైన్ చేసుకోవడం వల్ల పోలీస్ వారు ప్రతి రోజు రాత్రి పూట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జియో టాగ్ చేసి, నిఘా పెడతామని తెలిపారు.
2)మండపాలను రోడ్ కి అడ్డంగా నిర్మించటం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మండపాలను నిర్మించుకోవాలి.
3)ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందిని సంప్రదించి, వారి వద్ద నుండి పర్మిషన్ తీసుకుని, తగు జాగ్రత్తలు పాటిస్తూ, మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
3)నిమజ్జనం రోజు గణేష్ మండపాల నిర్వాహకులు రాత్రి వరకు ఉండకుండా తొందరగా తగు జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం చేయాలి.
4)DJ లకు పర్మిషన్ లేదు. సౌండ్ బాక్స్ లకు కూడా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి. ఒక వేళ DJ లు పెట్టినట్లయితే అట్టి DJ లను సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం.
5)తప్పనిసరిగా మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, లడ్డు విషయంలో దీపం విషయంలో జాగ్రత్తలు వహించాలని కోరారు.
అదే విధంగా ప్రతి గణేష్ మండపం వద్ద భక్తి భావం పెంపొందించేలా, సమాజ వికాసానికి సంబంధించిన వివిధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అంతేతప్ప రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని అసభ్యకరంగా ఉండే పాటలు డాన్సులు చేయవద్దు అని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఐ సందీప్ రెడ్డి, ఎస్.ఐ శంకర్, ఎస్.ఐ సైదులు, సురేష్, వార్డు కౌన్సిలర్లు సమద్, అభిమన్యు, శ్రీను, కంకణాల నాగిరెడ్డి, పూజిత శ్రీను, బాబా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సంపత్, హషం, నర్సిరెడ్డి, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Sep 06 2024, 21:36