తెలంగాణ తల్లి దొరల కోటలో బందీకావొద్దు
ఇవాళ సెక్రటేరియెట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవాళ సెక్రటేరియెట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే నేడు భూమి పూజ సైతం నిర్వహించింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విగ్రహం ఏర్పాటుకు ఇవాళ రేవంత్ భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఇవాళ శుభ దినమని పేర్కొన్నారు. పదేళ్ల నుంచి తెలంగాణ తల్లి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. 2004 కరీంనగర్‌లో తమ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మాట ఇచ్చారని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత అనేక రకాలుగా వెనుక బడ్డారన్నారు. తెలంగాణ తల్లిని వెనక్కి నెట్టి వారే సర్వం అన్నట్లు గత పాలకులు వ్యవహరించారన్నారు. ముళ్ళ కంచె ఏర్పాటు చేసుకొని రాజ భోగం అనుభవించారన్నారు. అది ఒకప్పుడు ఘడీల భవనమని.. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవనమని పేర్కొన్నారు.
పదేళ్లు ముఖ్యమంత్రి , మంత్రులు ఎవరూ అందుబాటులో లేరని.. అసలు సచివాలయంలోకి సామాన్యులకు ఎంట్రీయే లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి సచివాలయం నిర్మించిన వాళ్లకు కోటి రూపాయలు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేకపొయారని రేవంత్ విమర్శించారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదురుగా పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. సచివాలయం ఎదురుగా ఖాళీ స్థలంలో కొంతమంది తమ కోసం ఆపారన్నారు. తెలంగాణ తల్లి అంటే దర్పం, పోరాట పటిమకు స్ఫూర్తి అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి దొరల కోటలో బందీ కావొద్దన్నారు.
Sep 06 2024, 17:16