TG: రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రంథ పాలకులుగా డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఎంపిక
HYD: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్, గ్రంథ పాలకులు, డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ రాష్ట్ర స్థాయి కళాశాల ఉన్నత విద్య ఉత్తమ గ్రంథపాలకునిగా ఎంపిక అయ్యారు.బుధవారం రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తమ అధ్యాపకుల అవార్డు లలో భాగంగా డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం 5 వ తేదీ రవీంద్ర భారతిలో ఉత్తమ గంధ పాలకుడు అవార్డు తీసుకోబోతున్నారు.
దుర్గాప్రసాద్ గత 11 సంవత్సరాలలో ఆరు సంవత్సరాలు నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్గొండ లో (2018-2024) దాదాపుగా 63 వేల పుస్తకాలు నిర్వహణ, 55 పత్రికల నిర్వహణ, ఈ బుక్స్ ఈ జర్నల్స్ నిర్వహణ, కెరీర్ గైడెన్స్ విద్యార్థులకు, అన్ని ప్రభుత్వ హాస్టల్లో ఉచితంగా కెరీర్ గైడెన్స్ పై శిక్షణ, మరొక ఐదు సంవత్సరాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట అటానమస్ లో (2013-2018) కళాశాల గ్రంథ పాలకులుగా 53,000 పుస్తకాలు, 45 పత్రికలు, ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్ ద్వారా ఈ బుక్స్ ఈ జర్నల్స్ నిర్వహణ, కళాశాల అనుబంధ హాస్టల్లో ఉచితంగా కెరీర్ గైడెన్స్ పై శిక్షణ విద్యార్థులకు అందించారు.
గ్రంథాలయ నిర్వహణ, పుస్తకాల ఎంపిక, జర్నల్ లు, మ్యాగజైన్ లు నిర్వహణ, ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్ ద్వారా ఈ బుక్స్ ఈ జర్నల్స్ నిర్వహణ, గ్రంథాలయ అభివృద్ధి గ్రంథాలయ వనరులు, గ్రంథాలయ సేవలు, పరిశోధన విధానం, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ పై మూడు పుస్తకాలు ప్రచురణ, రాష్ట్రస్థాయి జాతీయస్థాయి సెమినార్లు, వేబినార్లు , వర్క్ షాప్ లో నిర్వహణ, రిసోర్స్ పర్సన్ గా జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ప్రజెంటేషన్, 42 పరిశోధన వ్యాసాలు, ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాక్ ద్వారా విద్య ఉద్యోగ సమాచారం సమాజాభివృద్ధి కోసం , విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కోసం సేవ చేయడం ద్వారా పనిచేస్తున్న కళాశాలల విద్యార్థులతో పాటు, విద్యార్థుల ప్రగతిని రికార్డ్స్ లో మరియు గూగుల్ ఫామ్స్ లలో నిర్వహణ , రాష్ట్రంలో దేశంలో వివిధ స్థాయిలలో వివిధ యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్ ద్వారా ఒకరోజులో 24 గంటలలో, రౌండ్ ద క్లాక్, ఎప్పుడైనా, ఎక్కడనైనా, అకాడమిక్ రీసెర్చ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సమాచారాన్ని 7 లక్షల మందికి పైగా, 144 దేశాల పాఠకులు ఉపయోగించుకున్నారని తద్వారా. ఎంతోమంది విద్యార్థులు జాతీయ మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం తోడ్పడ్డారని, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కోసం సమాచార వనరులు సామాజిక మాధ్యమం ద్వారా విద్యార్థులకు ఎల్లప్పుడూ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ద్వారా విద్య ఉద్యోగ సమాచార వనరులను అందించడంలో, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రిసోర్స్ పర్సన్ గా ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ పై అధ్యాపకులకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, గ్రంథాలయ సమాచార సేవ చేసినందుకు రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథపాలకుని అవార్డుకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోత్స్న ప్రభ తెలిపారు.
ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆయనను అభినందించారు.
Sep 05 2024, 22:18