అంధకారం లో కోదాడ పట్టణం.. రోడ్లన్ని జలమయం
సూర్యాపేట జిల్లా:
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా శనివారం కోదాడ పట్టణం జలమయం అయింది. రోడ్ల మీద నీళ్ళు ప్రవహించాయి. పట్టణంలోని రంగా థియేటర్, ఖమ్మం చౌరస్తా లలో భారీ వరద చేరడంతో కార్లు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
నీటి వరదలో చిక్కుకున్న వాహనాలు, ద్విచక్ర వాహనాల సైలెన్సర్ ల లోకి నీరు ప్రవేశించి వాహనాలు స్టార్ట్ కాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్డణంలోని శ్రీరంగాపురం రోడ్డు మద్యలో డివైడర్ల మీద నుండి నీరు ప్రవహించి జలపాతంలా మారింది.
ఖమ్మం వైపు వెళ్లే రోడ్డు మీద తమ్మర వద్ద ఉన్న వాగు బ్రిడ్జి పైనుండి మోకాళ్ళ లోతులో నుండి నీరు ప్రవహిస్తున్నది.
బారీగా కురిసిన వర్షానికి కరెంట్ సబ్ స్టేషన్ లోకి కూడా బారీగా నీరు చేరింది, దీంతో సాయంత్రం నుండే పట్డణం మొత్తం కరెంట్ లేని పరిస్థితి.
కోదాడ నుండి మేళ్ళచెరువు వెళ్ళే మార్గం కూడా బ్లాక్ అయింది. కోదాడ నుండి చుట్డు ప్రక్కల గ్రామాలకు వెళ్ళ లేని పరిస్థితి నెలకొన్నది.
పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలోకి వచ్చిన వరద నీరుతో కార్యాలయ సంబంధించిన సామాగ్రి ఫైల్స్ పూర్తిగా తడిసిముద్దయ్యాయి.
కోదాడలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరంతా రోడ్డు మీదనే ప్రవహిస్తూ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కోదాడ నుండి మేళ్ళచెరువు వైపు, ఖమ్మం వైపు , విజయవాడ వైపు వెళ్ళ లేని పరిస్థితి ఆ వైపు గ్రామాలకు వెళ్ళాల్సిన ప్రజలు ఎటు వెళ్ళాలో తెలియక పట్టణంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Sep 01 2024, 10:26