/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz **తెలుగు భాషా కోవిదుడు గిడుగు రామ్మూర్తి జయంతి కార్యక్రమం** janardhanreddy vemula
**తెలుగు భాషా కోవిదుడు గిడుగు రామ్మూర్తి జయంతి కార్యక్రమం**
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో రవీంద్ర భారతి హై స్కూల్ లో, తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది,, దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, ఈ సందర్భంగా బీసీ జేఏసీ కన్వీనర్, చేగొండి మురళీ యాదవ్,దాసరాజు జయరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు తమ విద్యార్థులకు తెలుగు భాష పట్ల గౌరవం మరియు వారికి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్పాలని క్రమశిక్షణతో ఉండాలని తెలియచెప్పారు, ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపల్ రమాదేవి, ఉపాధ్యాయులు ఎం వెంకటరెడ్డి, రవికుమార్, స్వరాజ్యం, భార్గవి విజయలక్ష్మి లలిత సునీత, అనిత సుమతి, శిరోమణి, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
*18వ విహెచ్పిఎస్ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ*
ఈరోజు మిర్యాలగూడపట్టణం లో *వికలాంగుల హక్కుల పోరాట సమితి 18వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిధులుగా రాష్ట్ర వికలాంగుల కన్వీనర్ పోల గాని వెంకటేష్ గౌడ్ గారు పాల్గొనడం జరిగినది పట్టణ అధ్యక్షులు సైదులు ఆధ్వర్యంలో రాష్ట్ర వికలాంగుల కన్వీనర్ పోల గాని వెంకటేష్ గౌడ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ మినీ పోస్టులో వికలాంగులకు వృద్ధుల కు వితంతువులకు గీత కార్మికులకు వికలాంగులకు 6000 పెన్షన్ మిగతా వారికి 4000 పెన్షన్ రూపాయలు తక్షణమే మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరినారు అలాగే వికలాంగులకు రాజకీయంగా 10 శాతం రిజర్వేషన్ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో 10 శాతం రిజర్వేషన్ బ్యాక్లాగ్ పోస్టులను వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం వికలాంగుల కార్పొరేషన్ ద్వారా నిధులు తక్షణమే మంజూరు చేయవలసిందిగా కోరినారు. వికలాంగులకు ద్విచక్ర వాహనాలు బ్యాటరీ వెహికల్ తక్షణమే మంజూరు చేయవలసిందిగా కోరినారు 2016 చట్టం ప్రకారం వికలాంగులను విమర్శించిన వికలాంగుల మీదకు వచ్చిన తక్షణమే జీవితాంతం జీవిత ఖైదీగా ప్రభుత్వాలు శిక్షలు విధించాలని ఎస్సీ ఎస్టీ కాడికి వికలాంగుల చట్టం ప్రకారం ఎక్కువగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయవలసిందిగా కోరినారు త్వరలో రాష్ట్ర వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ సారుగారు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వికలాంగుల సమస్యలు పరిష్కారం కోరుతాము అందరికీ పేరుపేరునా విలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మేకల నాగరాజు జిల్లా మహిళా అధ్యక్షురాలు వికలాంగుల చైతన్య రెడ్డి దర్శనం సైదులు పట్టణం ఇన్చార్జి పాల్వాయి సుధాకర్ నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లపల్లి సురేష్ నియోజకవర్గ కో కన్వీనర్ ఎంఐఎం జిల్లా అధ్యక్షులు పార్క్ బియ్యంపి పార్టీ జిల్లా నాయకులు నీలకంఠ మద్దిమడుగు గిరి చారి .
*మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ గారు..MLA -BLR గారు అకస్మిక తనిఖీలు*
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని *ఏరియా ఆసుపత్రిలో* ప్రజల ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్ *గౌ,, శ్రీ నారాయణ రెడ్డి గారు* మరియు మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. అకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది.హాస్పిటల్ లో ప్రతీ వార్డ్ సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, హాస్పిటల్ లోని సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు . అనంతరం డాక్టర్స్ మరియు సిబ్బంది రిజిస్టర్స్ చెక్ చేసి డైట్ సంబంధించిన మెనూ నీ పరిశీలించడం జరిగింది.. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో మరియు పరిసరాలలో క్రమం తప్పకుండా సానిటైజేషన్ చేస్తూ శుభ్రంగా ఉంచాలని సానిటైజేషన్ పై ఇకపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.. అలాగే డాక్టర్స్ క్రమం తప్పకుండా రావాలి వారి డ్యూటీ సమయంలో అందుబాటులో లేనిచో వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.. అలాగే పేషెంట్స్ కి మంచి పోషక ఆహారాలు అందించాలని అన్నారు.. ఇకపై ఏరియా ఆసుపత్రి పై ప్రజల్లోంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సహించబోమని అన్నారు..


అనంతరం మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు మానేయాలని అన్నారు.. మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన చర్యలు మేము తీసుకుంటున్నాం.. ఏదైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా మాకు తెలియజేయండి వారి పై వెంటనే చర్యలు తీసుకుంటాము అని అన్నారు.. అలాగే కొత్తగా నిర్మాణం చేస్తున్న హాస్పిటల్ బిల్డింగ్ నీ కూడా త్వరగా పూర్తయ్యేలా కావాల్సిన నిధులను విడుదల చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది .. అలాగే *రైస్ మిల్కర్స్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్* లాంటి పలు స్వచ్చంధ సంస్థల ద్వారా హాస్పిటల్ లో కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రణాలికను సిద్ధం చేసాము అని అన్నారు... నా ఈ పదవి కాలం పూర్తయ్యే సరికి మిర్యాలగూడలో ప్రతీ పేద మధ్యతరగతి వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చి దిద్దుతాం అని అన్నారు...
*ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతే నా లక్ష్యం* . *MLA BLR*.
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా *నేను నా మిర్యాలగూడలో* *ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి* పాటుపడతానని స్థానిక శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి* గారు అన్నారు. ఈరోజు స్థానిక బకల్ వాడి పాఠశాలలో *టాయిలెట్స్ నిర్మించి* విద్యార్థుల వినియోగంలోకి తీసుకురావడానికి తన *SDF నిధులనుండి* నిర్మించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారిని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వం పేద పిల్లల బడులను బాగు చేయడం ద్వారా వాళ్ల భవిష్యత్తును మెరుగుపరచడానికి కృషి చేస్తుందని అందులో భాగంగా ప్రతి పాఠశాలలో *కనీస వసతులు టాయిలెట్స్ మంచినీరు పరిసరాల పరిశుభ్రతను నా వంతు కృషిని* స్థానిక శాసనసభ్యులుగా కొనసాగిస్తున్నానన్నారు. అదేవిధంగా ఆగస్టు 15 ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అత్యున్నతమైన డాన్స్ మరియు NCC పరేడ్లో క్రమశిక్షణతో ప్రదర్శనమిచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
*దేశానికి సుస్థిరపాలన, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది* *MLA -BLR *
భారత మాజీ ప్రధాని, దివంగత నేత *రాజీవ్ గాంధీ* జయంతిని స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. *రాజీవ్ గాంధీ* విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా *MLA బత్తుల లక్ష్మారెడ్డి* గారు మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం రాజీవ్ గాంధీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశాడని అన్నారు. *రాజీవ్ గాంధీ* ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DCC శంకర్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మరియు బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
*అందరం కలిసి పర్యావరణాన్ని రక్షించాలి ..MLA -BLR*
ఈరోజు *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా *పర్యావరణ పరిరక్షణ* లక్ష్యంగా నిర్వహిస్తున్న *వన మహోత్సవం* కార్యక్రమంలో భాగంగా *సూర్య తేజ రైస్ మిల్* ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు అసోసియేషన్ వారు *250 మొక్కలు* నాటడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*. మొక్కలు నాటడం జరిగింది.. అనంతరం వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో భవిష్యత్తులో జరగబోయే పర్యావరణ మార్పులకు, కాలుష్య నియంత్రణ కు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా *మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్* వారు *20 వేల* మొక్కలను నారుతామని ముందుకు వచ్చారు .. అందులో భాగంగా ప్రతీ రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటడం జరుగుతుంది .. అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కుల, మత , వర్గ, పార్టీ విబేధాలు లేకుండా ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యి మొక్కలు నాటి భవిష్యత్తులో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కాలుష్య రహిత నియోజకవర్గంగా తీర్చిధిద్ధాలని అన్నారు... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
*2026లోనే శాసనసభ స్థానాల పెంపు* *స్పష్టం చేసిన కేంద్రం*
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లలో శాసనసభ స్థానాల పెంపు 2026 లోనేనని కేంద్రం స్పష్టం* రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరమే *ఏపీలో 175 నుంచి 225 శాసనసభ స్థానాలు* *తెలంగాణలో 119 నుంచి 153 శాసనసభ స్థానాల పెంపు* నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ ఎస్టీ స్థానాల పునఃసర్దుబాటు .
ఇండియాలో చిట్టి చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? దాని ప్రత్యేకతలివే..?
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో ఇండియా కూడా ఒకటి. రోజులో కోట్ల జనాబ రైల్వే ప్రయాణం చేస్తుంటారు.. సుధీర్ఘ రైల్వే లైన్ తో పాటు.. చరిత్ర కలిగిన ఇండియా రైల్వేలో.. చిట్టచివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? రోజుకు 2 కోట్ల మందికి పైగా ప్రయాణికులు, దగ్గర దగ్గరగా 70 వేల కిలోమీటర్ల నెట్ వర్క్.13 వేలకు పైచిలుకు రైళ్ళు. వేలాదిగా రైల్వే స్టేషన్లు.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. ఇండియన్ రైల్వే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండియన్ రైల్వే మొదలైన దగ్గర నుంచి.. ఇప్పటి వరకూ జరిగిన డెవలప్ మెంట్..అద్భుతాలు.. అతిపెద్ద ప్రమాదాలు.. ఇవన్నీ అతిపెద్ద చరిత్ర అవుతుంది. భావితరాలకు ఇండియన్ రైల్వే.. ఓ పాఠం అవుతుంది. వేల స్టేషన్లు కలిగి ఉన్న భారతీయ రైల్వేకు ఎంతో చరిత్రం ఉంది..ఒక్కోక్క రైల్వే స్టేషన్ కు ఒక్కో కథ ఉంది.. వాటి వెనుకాల ఎంతో మంది త్యాగం ఉంది. ఇలా చెప్పుకుంటే చాలా అవుతుంది కాని.. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. ఇండియాలో చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఏది.. ఎవరికైనా తెలుసా..? భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా? ఇది ఎక్కడ ఉంది..? దాని ప్రత్యేకత ఏంటి..? ఇండియాలోనే చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఎక్కడో లేదు బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకుని.. వెస్ట్ బెంగాల్ లో ఉంది భారతదేశపు చివరి రైల్వే స్టేషన్. ఆ స్టేషన్ పేరు సింగాబాద్ రైల్వే స్టేషన్. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని హబీబ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ను భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్‌గా పరిగణిస్తుంటారు. ఎందుకంటే దీని తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభమవుతుంది. సింగాబాద్ రైల్వే స్టేషన్ చాలా చిన్నది.. పురాతనమైనది కూడా.. బ్రిటీష్ కాలంలో దీన్ని నిర్మించారు. ఎంత చిన్నదైనా.. చాలా ప్రాచీనమైనది కావడంతో.. ఈ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య గత సంబంధాలలో ఇది కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రానికి ముందు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తులు ఢాకా వెళ్ళడానికి ఈ స్టేషన్ గుండా వెళ్ళేవారు. అంత చరిత్ర ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయింది. కనీసం ప్రభుత్వాలు.. ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి.. హెరిటేజ్ ప్రాపర్టీగా కూడా దీన్ని కాపాడటంలేదు. ఎవరూ పట్టించుకోకపోవడంతో. ఇప్పుడు రైల్వే స్టేషన్‌ నిర్మానుష్యంగా మారింది. ఇప్పుడు ఇక్కడ ప్రయాణీకుల కోసం ఏ రైలు ఆగదు. ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు గూడ్స్ రైళ్లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్‌కు కొన్ని గూడ్స్ రైళ్లు నడుస్తాయి. ఈ రైల్వే స్టేషన్ కేవలం వ్యాపారానికి మాత్రమే ఉపయోగపడుతోంది. ఇక్కడ ఏ రైలు ఆగదు లేదా ప్రయాణీకులు ఎవరూ రారు. అందువల్ల ఈ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్జనంగా కనిపిస్తుంటాయి. టిక్కెట్ కౌంటర్లు కూడా మూసివేశారు. స్టేషన్‌లో కొంతమంది రైల్వే సిబ్బంది మాత్రమే ఉన్నారు
*సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనుల రాజ్యాధికారం కోసం ఉద్యమిద్దాం* *చౌగాని సీతారాములు KGKS జిల్లా ప్రధాన కార్యదర్శి*
ఈరోజు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతిని నల్లగొండలోని వృత్తిదారుల కార్యాలయంలోజిల్లా అధ్యక్షులు *కొండా వెంకన్న* అధ్యక్షతనఘనంగా నిర్వహించారు ! ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగానీ సీతారాములు మాట్లాడుతూ 1650 సంవత్సరంలో ధర్మయ్యా సర్వమ్మ దంపతులకు సామాన్య కల్లుగీత కుటుంబంలో జన్మించి గోల్కొండ కోటని రాజధానిగా చేసుకుని బహుజనుల రాజ్యాన్ని స్థాపించిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడినారు షాపూర్ను తన రాజధానిగా చేసుకుని తెలంగాణ ప్రాంతంలోని కొలనుపాక తాటికొండ ఎలగందుల చేర్యాల హుస్నాబాద్ భువనగిరి జనగామ తో సహా అనేక ప్రాంతాలను పాలించిన నాయకుడు అని అన్నారు క్రూరమైన ఇస్లామిక్ దౌర్జన్యాన్ని అరాచక పాలనను ముస్లిం జమీందారులపై నిరంతరం దాడులు చేసిన గందర గండడు 1710 లో ఇస్లామిక్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన భీకర యుద్ధంలో పాణాలు కోల్పోయిన వెన్నుచూపని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అనికొనియాడారు ఆయన స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని గౌడులకు కల్లుగీత కార్మికులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు *అచ్చాలుగారు* మాట్లాడుతూ యుద్ధాలు వద్దురా కొడకా మనది కల్లుగీత వృత్తి అది చేసి బతకాలి అని తల్లి అంటే తాటిచెట్టు ఎక్కితే ఏమొస్తది అమ్మ ముంతటి కల్లు తప్ప కొడితే గోల్కొండ కోటని కొట్టాలి అని బదిలిచ్చిన వీరుడు పాపన్న అని కొని నాడినారు ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల గోపాల్ జిల్లా సహాయ కార్యదర్శి రాసకొండ వెంకట్ గౌడ్ నేలపట్ల నరసింహ గౌడ్ రాంబాబు స్వామి నరసయ్య వెంకన్న కొండ రాములు తదితరులుపాల్గొన్నారు
హైదరాబాద్‌ నిమ్స్‌లో 101 ఉద్యోగాలు.. **నెలకు రూ.32,500**
నిమ్స్‌-హైదరాబాద్‌ భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన 101 టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేయనుంది. హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 101 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.32,000 వేతనం ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 24 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.nims.edu.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు

టెక్నీషియన్‌ ఖాళీలు :

101 విభాగాలు: రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో మెడికల్, థెరపిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్‌, అనస్తీషియా, బ్లడ్ బ్యాంక్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 36 ఏళ్లు మించకూడదు. వేతనం: నెలకు రూ.32,500 గా ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చిరునామా: దరఖాస్తులను ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2వ అంతస్తు, ఓల్డ్‌ ఓపీడీ బ్లాక్‌, నిమ్స్‌, పంజాగుట్ట చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 24