నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు, వికలాంగులకు ఓపి దగ్గర ప్రత్యేక లైన్ కేటాయించండి: సామాజిక కార్యకర్త సాదిక్ పాషా
నల్గొండ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాస పడితే కానీ వైద్యం అందే పరిస్థితి లేదు
వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సాధారణ జ్వరాలు మరియు మలేరియా, డెంగీ జ్వరాలతో ప్రజలు నిత్యం వందల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు వారు ముందుగా ఓ.పి చీటి తీసుకుని డాక్టరు వద్దకు వెళ్ళాలి మరి ఓ.పి చీటి తీసుకోవడం అంత సులువైన పనేం కాదు వరుసలో గంటలు వెచ్చించాల్సిన పరిస్థితి ఓ.పి విభాగంలో ముగ్గురు సిబ్బంది వుంటారు ఒకరు పురుషులకు, మరొకరు మహిళలకు, ఇంకొకరు వృద్దులకు/వికలాంగులకు ఓ.పి ఇవ్వాలి కానీ ఇక్కడ అదేం వుండదు ఒక లైను పురుషులకు మరొక లైను మహిళలకు మాత్రమే ఇస్తారు. మరి వృద్దులు/వికలాంగులు సాధారణ పురుషుల మాదిరిగా గంటల కొద్ది లైనులో వేచి వుండలేరు అలాంటి వారికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి వారికి సత్వరమే వైద్య సేవలు అందజేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వున్నారు.
ఇదే విషయమై నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త *ఎం.డి. సాదిక్ పాషా* నల్గొండ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ని కలిసి ఓ.పి విభాగం నందు వేగం పెంచడంతో బాటుగా వృద్దులకు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఓ.పి చీటి ఇచ్చే సదుపాయం కల్పించి అలాగే వైద్యం కొరకు వచ్చే రోగులు వారికి ఎద్దురయ్యే ఇబ్బందులను ఎవరికి పిర్యాదు చేయాలో ఆ అధికారుల ఫోన్ నంబర్లను అందరికి కనపడేలా ఏర్పాటు చేయాలని మరియు రోగులు కూర్చునే కుర్చీలను ఓ.పి వద్ద బారికేడ్లుగా వాడుకోవడంతో రోగులు ఎక్కడ కూర్చువాలో అర్ధం పరిస్థితి ఉందని కావున రోగులు కూర్చునే కుర్చీలను వారికే కేటాయించాలని కోరారు దానికి సూపరింటెండెంట్ సానుకూలంగా స్పందించి తప్పని సరిగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా సాదిక్ పాషా మాట్లాడుతూ వైద్యం అందించడంలో వేగం పెంచాలని అలాగే రోగులకు తగ్గట్లుగా వైద్యులు ఉండేలా చూడాలని ఏర్పాట్లు చేయాలని కోరారు.
Aug 28 2024, 09:01