NLG: కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
నల్లగొండ :రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలో ఎలాంటి కొరివిలేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ, ఇవాళ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాకు సత్యం సంఘీభావం తెలిపి మాట్లాడారు. రైతులు వ్యవసాయం సాగు కోసం బ్యాంకులలో చేసిన అప్పులు గత ప్రభుత్వం 1లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆగస్టు 15 లోపు 2లక్షలు రుణ మాపీ చేస్తామని హమీ ఇచ్చి, కొంత మంది రైతులకే రుణమాఫీ చెశారు అయితే క్షేత్ర స్థాయిలో కేవలం 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం పెట్టిన రేషన్ కార్డ్ షరతులు రైతులకు శాపంగా మారిందని విమర్శించారు.
గత పదేళ్లుగా ఎవరికీ నూతన రేషన్ కార్డు రాకపోవడంతో ఉమ్మడి కుటుంబంలోనీ రైతులకు రేషన్ కార్డు ఉన్నాయని, మరికొంతమందికి రేషన్ కార్డులు లేకుండా పోయాయని పేర్కొన్నారు. దీని మూలాన రైతులు రుణమాఫీ విషయంలో తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి షరతులు లేకుండా భూమి పాస్ పుస్తకం ఉన్న అర్హులైన రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రైతులకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. రుణమాఫీ కి ఆంక్షలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రెండు లక్షల రుణాలు మాఫీ చేయడంతో పాటు రైతు భరోసా ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని బ్యాంకుల అధికారులు కావాలని రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాంటి బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి మొయినుద్దీన్, గురజా రామచంద్రం, వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు,గీత పనివారాల సంఘం జిల్లా అధ్యక్షులు పబ్బు వీరస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోడంగి శ్రవణ్ కుమార్, బలుగూరి నరసింహ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి. వెంకటేశ్వర్లు,రైతు సంఘం నాయకులు బుర శేఖర్ బండమీది యాదయ్య, వెంకన్న, పాండు, సుదర్శన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కు వినతిపత్రం పత్రం అందజేశారు.
Aug 27 2024, 21:57