నల్లగొండ: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బీసీ మండల్ జయంతి వేడుక.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య..
బిపి మండల్ గారి 106 వ జయంతి సందర్భంగా నల్లగొండ, కోర్టు ఎదురుగా బి.పి మండల్ విగ్రహం దగ్గర ఘనంగా జయంతి వేడుకలు మిర్యాల యాదగిరి సభా అద్యక్షులు (బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు) ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యాసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతం కు పెంచాలని లేకపోతే ఉద్యమం ఉధృతం - హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటీసీ, వార్డు మెంబర్ల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం కు పెంచుతామని మేనిఫెస్టో లో తెలిపిన ప్రకారం మాట మీద నిలబడి పెంచాలని జాతీయ బీసీ సంఘం అద్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఈ మేరకు హెచ్చరిక చేశారు. ప్రభుత్వం వచ్చే అక్టోబర్ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది.కులగణన చేసిన తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి.ఇంకా కులగణన ప్రక్రియ ప్రారంభించలేదు. బిసి సంఘాల ఆధ్వర్యంలో కులగనన చేయాలని 42 శాతం కు బిసి రిజర్వేషన్లు పెంచాలని మూడు నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. రాహుల్ గాంధీ అయినా స్పందించాలని కోరారు.రాష్ట్రంలో అన్ని పార్టీ రాజకీయ పార్టీలు టిఆర్ఎస్,బిజెపి,సిపిఐ, సిపిఎం పార్టీలు బిసి రిజర్వేషన్లపై మద్దతు తెలుపుతారా? లేదా ? విధాన ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ వాగ్దానాన్ని బీసీలు నమ్మారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని బిసి నేతలు జెండాలు మోసుకుంటూ జిందాబాద్ లో పొట్టు కొట్టు బానిస బతుకులు వద్దు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు త్వరలో గ్రామ ఉద్యమాన్ని విస్తరింప చేస్తామని హెచ్చరించారు ప్రతి ఒక్క బీసీ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బహిరంగ సభలో ప్రతిరోజు కుల జనన జరుపుతామని దాని ప్రకారము విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని బడ్జెట్ కేటాయిస్తామని -బిసి ఎజెండా ఎత్తుకొని బీసీల అభిమానం చూరగొంటుంటే ఇక్కడ బీసీలకు అన్యాయం చేయడం తగు న్యాయమా అని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ చేయాలి సుప్రీంకోర్టు ప్రకారం తీర్పు ప్రకారం 50 శాతం సీలింగ్ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వీలు లేదు ఇప్పటికే అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి 50 శాతం సీలింగ్ పై పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది ఆ అగ్రకులాలకు రిజర్వేషన్లను పెంచడానికి మూడు రోజులలో లోక్సభ రాజ్యసభలలో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి సంతకం చేశారు కానీ 50% జనాభా గల బీద కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా మా దేశంలో ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. అసెంబ్లీలో చట్టం చేసి 92 శాతం పెట్టవచ్చు అవసరమైతే అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నవి పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం గతంలో 1986లో బిసి సంక్షేమ సంఘం అనేక ఉద్యమాలు చేయగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు స్పందించి బీసీలకు జడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలలో 20% రిజర్వేషన్లు పెట్టారు. సర్పంచ్ లకు పెట్టలేదు బీసీ రిజర్వేషన్లను 50 శాతం కు పెంచాలని సర్పంచ్ ఎన్నికలలో కూడా బీసీ రిజర్వేషన్లు పెట్టాలని బిసి సంక్షేమ సంఘం ఆరు సంవత్సరాలు వరుసగా సుధీర్గంగా ఉద్యమాలు చేయగా 1993లో అప్పటి ముఖ్యమంత్రి ఉదయ భాస్కర్ రెడ్డి స్పందించి ఒక మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి బీసీ సంఘాలతో చర్చించి 20% నుంచి 34 శాతం పెంచుతూ రిజర్వేషన్లు పెట్టారు. అప్పటినుంచి 2019 వరకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగాయి సుప్రీంకోర్టు తర్వాత తీర్పు ప్రకారం 2019లో స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతం కు తగ్గించారు దీనితో బీసీలకు అన్యాయం జరిగింది అప్పటినుంచి జాతీయం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దీన్ని పార్లమెంటు వద్ద ధర్నాలు జరిపి అన్ని పార్టీల మీద ఒత్తిడి తేవడంతో కులగణన జరిపి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని అన్ని పార్టీలు హామీ ఇచ్చారు అందులో భాగమే పెంచుతామన్న కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రకారం పెంచుతామని హామీ ఇచ్చారన్నారు.
రాజారాం యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగం లో బిసి లకు రిజర్వేషన్లు కల్పించలేదు. రాజ్యాంగ సవరణ చేసి బిసి లకు జనాభా లెక్కల ప్రకారం బిసి లకు రిజర్వేషన్లు కల్పించాలి.దేశవ్యాప్యంగా కులగణన చెపట్టాలి లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం.కాంగ్రస్ పార్టీ కామారెడ్డి బిసి డిక్లరేషన్ ప్రకారం కుల గణన చేపట్టాలి.స్తానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించాలి.
బిపి మండల్ విగ్రహ కమిటీ చైర్మన్ నాగుల వేణు మాధవ్ మాట్లాడుతూ రాజ్యాధికారంలో ఉన్న వర్గాలే రిజర్వేషన్లు తీసుకోవడం చరిత్రలో ఎక్కడ కూడా జరగదు అని అన్నారు.ఉద్యోగుల ప్రమౌషన్స్ లో రిజర్వేషన్లు కల్పించాలని, కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దూకుడుకు లక్ష్మీ నారాయణ, నీల వెంకటేశం, పిల్లి రామరాజు, వంగూరి నారాయణ యాదవ్, ప్రసన్న, శిరందాసు రామదాసు, సత్తయ్య, సర్పాల వెంకన్న, అల్లి వేణు, మామిడి పద్మ, సింగం లక్ష్మీ,
కొండూరు సత్యనారాయణ, గోవార్దన్, గద్దె నాగరాజు, సతీష్ యాదవ్, వల్లేకీర్తీ శ్రీనివాస్, మచ్చ గిరి తదితరులు పాల్గొన్నారు.
Aug 25 2024, 19:30