పాలనపై అవగాహన లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యావు... సుప్రీంకోర్టులో లేని ముదిరాజుల కేసును ఎలా వాదిస్తావు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
పాలనపై అవగాహన లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యావు...
సుప్రీంకోర్టులో లేని ముదిరాజుల కేసును ఎలా వాదిస్తావు!
ముదిరాజుల బీసీ ఏ అంశం బీసీ కమిషన్ వద్ద ఉన్నది మీకు తెలియదా?
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
చిన్నకోడూరు
పాలనపై అవగాహన లేక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి ఎలా అయ్యావని రేవంత్ రెడ్డిని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ప్రశ్నించారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏ కి మార్చే అంశం సుప్రీంకోర్టులో ఉందని మంచి లాయర్ ను పెట్టి వాదిస్తానన్నడం,రేవంత్ రెడ్డికి తెలువకన, లేక ముదిరాజులను మోసం చేయడ మా అన్నారు. సుప్రీంకోర్టు గతంలోనే ముదిరాజులను బీసీఏలోకి మార్చాలని బీసీ కమిషన్ కు ఆదేశాలు పంపించిందని అన్నారు. నేటి వరకు బీసీ కమిషన్ దగ్గర ఉన్న ఫైల్ ను కదిలించడం లేదన్నరు. బీసీ కమిషన్ వద్ద ఉన్న ఫైల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా తెప్పించుకొని ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలను ముదిరాజులు నమ్మే ప్రసక్తి లేదన్నారు. మరోసారి నమ్మి మోసపోలేమని, ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చి, బీసీఏలోకి మారుస్తున్నట్లు అసెంబ్లీ తీర్మానం చేస్తేనే ముదిరాజ్ సమాజం రేవంత్ రెడ్డిని నమ్ముతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు కీసరి పాపయ్య ముదిరాజు, పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మిద్దె రవి ముదిరాజు, యువత జిల్లా అధ్యక్షుడు పడిగ లింగం ముదిరాజు పాల్గొన్నారు
Aug 25 2024, 18:13