/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz మునుగోడు నియోజకవర్గ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి Mane Praveen
మునుగోడు నియోజకవర్గ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నియోజకవర్గ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలని ఒక ప్రకటనలో తెలిపారు. అన్నా, చెల్లెళ్లు అక్కా, తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక  అయిన రాఖీ పండుగ ను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మహిళల సాధికారత తో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని పేర్కొన్నారు.
మర్రిగూడ లో ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కేంద్రములో ఆదివారం సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా, పలువురు గ్రామస్తులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీత నాగిల్ల మారయ్య మాట్లాడుతూ.. గోల్కొండ కోటను  ఏలిన మొట్టమొదటి బహుజన చక్రవర్తి, తురుష్కులను తరిమి కొట్టిన గొప్ప యుద్ద వీరుడు, గోల్కొండ ను స్వాధీనం చేసుకుని సాటి లేని యుద్ద నైపుణ్యాలతో ఔరంగజేబు కు తెలంగాణ దెబ్బ రుచి చూపించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడి, దొరల అరాచకాలను మొగలాయి  దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు.. శ్రీ సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.
NLG: కవి, హోంగార్డు రగుడంపల్లి వెంకటయ్య కు సన్మానం
నల్లగొండ:
దేవరకొండ ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్  నియోజకవర్గ కార్యాలయం లో  ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళితరత్న డా.బుర్రి వెంకన్న,నల్లగొండ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు భిక్షపతి,డివిజన్ నాయకులు  చెపూరి రాజేష్,లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ నక్క వెంకటేష్ లు ఇవాళ పాటల రచయిత, కవి  రగుడంపల్లి వెంకటయ్య ను  ఘనంగా  సన్మానించారు.

వెంకటయ్య వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డుగా ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు.ఒక ప్రక్క విధులు నిర్వహిస్తూనే తనకు పాటల మీద ఉన్న మక్కువతో రచనలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నాయకులు అన్నారు.

వెంకటయ్య స్వగ్రామం డిండి మండలం లోని గనబోయినపల్లి గ్రామం నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలను ఓర్చుకొని చదువుకున్నాడు. తన విద్యకు సాకారంగా తనదైన శైలిలో పాటలు వ్రాయడం సంతోషంగా ఉందని ముందు ముందు మరిన్ని మంచి పాటలు వ్రాసి ఎన్నో సన్మానాలు అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నట్లు  వారి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ మధ్య కాలంలోనే ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళితరత్న డా. బుర్రి వెంకన్న గౌరవ డాక్టరేట్ అందుకున్న విషయం విదితమే ఆయన మాట్లాడుతూ.. దళితజాతి నుండి యువకులు తన స్వంత ప్రతిభ ను కనబరుస్తూ మహనీయుల అడుగుజాడలో ప్రయణిస్తూ  చైతన్యవంతులై సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారని వెంకటయ్య లాంటి వ్యక్తి నేటి యువతకు ఆదర్శం అని ఆయన అన్నారు. జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు భిక్షపతి మాట్లాడుతూ.. వెంకటయ్య తనకు బందువు అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ నక్క వెంకటేష్ మాట్లాడుతూ.. పాటలు చాలా బాగున్నాయి.  మంచి భవిష్యత్తు ఉంటుందని రాబోవు కాలంలో రాష్ట్రస్థాయిలో వెంకటయ్యకు గుర్తింపు వచ్చే విధంగా సంఘం ద్వారా కృషి చేస్తామని తెలియజేశారు.ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సన్మాన గ్రహీత రగుడంపల్లి వెంకటయ్య  కృతజ్ఞతలు తెలియజేశారు.
సాగర్ రింగ్ రోడ్ లో బస్సులను పరిశీలించిన నల్లగొండ ఆర్ఎం

నల్లగొండ జిల్లా టీజీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజశేఖర్ హైదరాబాదులోని సాగర్ రింగ్ రోడ్డు ప్రయాణికుల ప్రాంగణం వద్ద బస్సులను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాఖీ పండగ వేల రద్దీతో ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని, దేవరకొండ మరియు నాగార్జునసాగర్ లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ డిపో మేనేజర్ రమేష్ బాబు, ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ బి వెంకట నరసయ్య, మరియు ఇతర ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

కేఎన్ బయోసెన్సెస్-చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యవసాయ రైతు సదస్సులు
రైతుబడి కార్యక్రమంలో అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ సుధారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బొమ్మపాల గిరిబాబు

నల్గొండ ఎన్జీ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తున్న రైతు బడి ఎగ్జిబిషన్ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు నల్లగొండకు విచ్చేసిన కేఎన్ బయోసైన్సెస్ వ్యవస్థాపకులు ప్రముఖ అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ సుధా రెడ్డిని  చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు ప్రత్యేకంగా కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయరంగం అభివృద్ధి కొరకు డాక్టర్ సుధా రెడ్డి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్గానిక్ రైతులను ప్రోత్సహించడానికి కే.ఎన్. బయోసెన్సెస్ మరియు చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో, ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 

గత 15 సంవత్సరాల నుండి ఉమ్మడి జిల్లాలో క్రీడాకారుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేస్తూ, సామాజిక బాధ్యతగా ఆర్గానిక్ వ్యవసాయరంగం అభివృద్ధి కొరకు వివిధ సంస్థలతో సదస్సులు నిర్వహించి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని, యువతీ, యువకులు ఈ రంగంలో రాణించేటందుకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని తెలిపారు.
NLG: ఫోటో జర్నలిస్టులు ముచ్చర్ల బ్రదర్స్ కు రాష్ట్రస్థాయి అవార్డులు
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నల్గొండ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, హన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్  ముచ్చర్ల శ్రీనివాస్ లు తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులకు ఎంపికయ్యారు. వారిద్దరూ అన్నదమ్ములు కావడం విశేషం.

ఈ మేరకు హైదరాబాద్ గ్రీన్ పార్క్‌ హోటల్ లో ఈ నెల 19  ఉదయం 9 గంటలకు సమాచార శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులను మరియు నగదు పారితోషికాన్ని అందుకోనున్నారు.

ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలోని పలువురు జర్నలిస్టులు వారికి అభినందనలు తెలిపారు.
డా.బుర్రి వెంకన్న ను సన్మానించిన టిజి ఎంఆర్పిఎస్ నాయకులు
నల్లగొండ జిల్లా:
కొండ మల్లెపల్లి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ ఆఫీసులో ఇవాళ టిజి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు అన్నేపాక సంజీవ, ప్రదాన కార్యదర్శి ఎర్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన దళిత రత్న బుర్రి వెంకన్న ను మర్యాదపూర్వకంగా కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రం పటాన్ని బహుకరణ చేసి శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు దళిత రత్న మద్దిమడుగు బిక్షపతి గారు పాల్గొని మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి యువతను చైతన్య పరుస్తూ భారత రాజ్యాంగ హక్కులు పూర్తిస్థాయిలో తెలియపరుస్తూ అవగాహన సదస్సు నిర్వహిస్తూ, జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొంది ఇప్పుడు గౌరవ డాక్టరేట్ తీసుకోవడం చాలా సంతోషకరమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా సమతా సైనిక దళ్ అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని భారత రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరుడికి అందే విధంగా నిరంతరం పనిచేస్తుందని వారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో  అన్నేపాక సంజీవ. జెడ చంటి, దర్శనం దేవా, ఎలిమినేటి చిన్న యాదయ్య, వస్కుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఈ నెల 30
నల్గొండ: అక్టోబర్ లో జరిగే ఓపెన్ స్కూల్ 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు అయ్యేందుకు పరీక్ష ఫీజును ఈనెల 30 వ తేదీలో చెల్లించాలని డిఈఓ బిక్షపతి మరియు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జగదీష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు మీసేవ కేంద్రం ద్వారా పరీక్ష ఫీజును చెల్లించి రసీదు ను సంబంధిత స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ కు అందజేయాలన్నారు. పరీక్ష ఫీజును నిర్ణీత రుసుము తో ఈనెల 22 నుండి 30 వ తేదీ లోపు చెల్లించాలని పేర్కొన్నారు.
NLG: యూత్ ఫర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో బొట్టుగూడ హైస్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన, ఈరోజు యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో సైన్స్ విభాగంలో ప్రాథమిక స్థాయి పరీక్ష నిర్వహించారు.అనంతరం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించి, రక్షాబంధన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అదేవిదంగా పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సైదులు, తిరుపతి ,పాఠశాల టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
గౌరవ డాక్టరేట్ అందుకున్న బుర్రి వెంకన్నను సన్మానించిన ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా:
దేవరకొండ: ఆల్ ఇండియా సంస్థ సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. బుర్రి వెంకన్న ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మరియు చందంపేట  పీ ఏ సి ఎస్ చైర్మన్ జాలె నరసింహారెడ్డి లు శుక్రవారం డా. బుర్రి వెంకన్నను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబాసాహెబ్ స్థాపించిన సంస్థ ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంఘం ద్వారా తెలంగాణ రాష్ట్ర, నల్గొండ జిల్లా లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను దళిత రత్న బుర్రి వెంకన్న రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకొని నేడు ప్రతిష్టాత్మకంగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం.. ఆయన మన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ వాసి కావడం సంతోషకరమని అన్నారు.     

డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారికి భారత రాజ్యాంగ ఫలాలు, హక్కులను ప్రతి పౌరుడికి అందే విధంగా సామాజిక పోరాటాలు నిర్వహించినందుకు, నాకు గౌరవ డాక్టరేట్ రావడం చాలా సంతోషకరమని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.తన గౌరవ డాక్టరేట్ ను తన వెన్నంటూ ఉండి సంపూర్ణ సహకారం అందించిన తన కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, డివిజన్ ఉపాధ్యక్షులు అందుగుల గిరి, పీఏ పల్లి మండల అధ్యక్షులు జిల్లా రాములు, కొండమల్లేపల్లి మండల ఉపాధ్యక్షులు చేపూరి రాజేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, మామిడి చెట్టు యాదగిరి. టీజీ ఎంఆర్పిఎస్ మల్లేపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఎర్ర ప్రసాద్, కడారి రాజు, ఖండేలా వెంకన్న లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.