**తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది**
తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది దేశంలో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కనెక్టివిటీని పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,657 కోట్లు కాగా.. కేంద్ర ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో మల్కాన్‌గిరి - పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా 174 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రా తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లో మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించనున్ననారు. ఈ ప్రాజెక్టు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది కోల్‌ఫీల్డ్ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. తెలంగాణ వార్తలు తెలంగాణ సినిమా వార్తలు లైఫ్‌స్టైల్ రాశి ఫలాలు ఒలింపిక్స్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ జాబ్స్ ఫోటో గ్యాలరీ వైరల్ సంక్షిప్త వార్తలు స్పోర్ట్స్ బిజినెస్ టీవీ ఆధ్యాత్మికం వీడియో గ్యాలరీ ఏది నిజం అనంత్ అంబానీ వెడ్డింగ్ ట్రావెల్ జోక్స్ వెబ్ తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దేశంలో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కనెక్టివిటీని పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,657 కోట్లు కాగా.. కేంద్ర ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో మల్కాన్‌గిరి - పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా 174 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మేలు. తెలంగాణకు కేంద్రం నుంచి గుడ్‌న్యూస్ తెలంగాణలో కొత్త రైలు మార్గానికి గ్రీన్ సి తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లో మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించనున్ననారు. ఈ ప్రాజెక్టు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది కోల్‌ఫీల్డ్ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్లేందుకు వీలుంటుంది. దక్షిణ ఒడిశా, బస్తర్ ప్రాంతం నుంచి దక్షిణాదికి దూరం (124 కిలోమీటర్లు) తగ్గుతుంది. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 1,697 హెక్టార్ల భూమి సేకరించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో 900 కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 64 కొత్త రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు.. 510 గ్రామాలు, 14 జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ల కారణంగా రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానత పెరుగుతుంది అంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ఏటా 140 మిలియన్ టన్నుల సరకులను అదనంగా రవాణా చేయొచ్చు. ఈ ప్రాజెక్టుల్ని ఐదేళ్లలోనే వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఈ లైన్లు అందుబాటులోకి వచ్చాక 32.20 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గడంతో పాటు 0.87 మిలియన్ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్‌లు తగ్గుతాయి. అది 3.5 కోట్ల చెట్లు నాటడంతో సమానం అని చెబుతున్నారు. మొత్తం మీద కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం చేకూరనుంది.
Aug 14 2024, 21:58