భద్రాచలం: చర్ల:చర్ల మండలంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి మెడికల్ సిబ్బందిని పెంచాలి.పి వై ఎల్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేత
చర్ల మండలంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి మెడికల్ సిబ్బందిని పెంచాలి:పి వై ఎల్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి పత్రం
చర్ల మండలంలో ప్రజలు గత కొంతకాలంగా కురిసిన భారీ వర్షాల మూలంగా పంచాయతీ సెక్రటరీలు సరిగా లేక స్వచ్ఛతనం లేక బ్లీచింగ్ పౌడర్ చల్లకపొగా పూర్తిగా ఏజెన్సీ చర్ల మండలమైన గ్రామాలలో ప్రజలు విష జ్వరాలతో తీవ్రమైన నొప్పులతో ప్రజలు మంచాన పడి ఉన్నారని కదలలేని పరిస్థితిలో ఉన్నారని ఆస్పత్రికి వచ్చే పరిస్థితి కూడా లేదని వారికి తక్షణమే వైద్య సౌకర్యం కల్పించాలని గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని పివైఎల్ ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు మండలంలో ఉన్న ప్రధాన ఆసుపత్రిలో డాక్టర్లను స్టాఫ్ నర్స్ను సిబ్బందిని మంచినీటి సౌకర్యాన్ని స్కానింగ్ మెడికల్ షాపుల్ని ఏర్పాటు చేయాలని ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్,తరుపున చర్ల తహసిల్దార్ శ్రీనివాస్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఐటిడిఏ కూడా జోక్యం చేసుకొని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా వెనకబడినటువంటి చర్ల మండలం పై దృష్టి సారించాలని రెక్కాడితే డొక్కాడని ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని ఆ ప్రజలకు వైద్యం గురించి తెలియదని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి అన్యం పుణ్యం తెలవని ప్రజలు వారిని చైతన్యపరిచి వైద్య సౌకర్యాలని సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో పి వై ఎల్ మండల నాయకుడు కారం సురేష్ పిడిఎస్యు మండల నాయకుడు ఇరుప రాజేష్ శ్యాంసుందర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Aug 14 2024, 21:05