యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా వాల్ పోస్టర్ల ఆవిష్కరణ..
యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ మహమ్మారి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు. తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలన్నారు. గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడం లక్ష్యమన్నారు దీనికి అందరూ సహకరించాలన్నారు గంజాయి కి సంబంధించినటువంటి సమాచారమైన 87126 70266 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు.ఈ సందర్భంగా యువత విద్యార్థులను చైతన్యం చేస్తున్న డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ని అభినందించారు.భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దానికి జిల్లా యంత్రాంగం తరపున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మం పాటీ శంకర్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్యఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు రమావత్ లక్ష్మణ్ నాయక్ బుడిగ వెంకటేష్ స్పందన పావని సంపత్ నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
Aug 13 2024, 19:15