నల్లగొండ: మండల మహిళా సమాఖ్య లో పనిచేస్తున్న అటెండర్స్ అందరికీ కనీస వేసిన 18వేలు అమలు చేయవలసిందిగా డిఆర్ డిఓ పిడి శేఖర్ రెడ్డికి వినతి పత్రం..
![]()
మండల మహిళా సమైక్య అటెండర్స్ కు వేతనాలు పెంచాలి.
సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ
మండల మహిళా సమైక్య లో అటెండర్స్ గా పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం 18వేలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మండల మహిళా సమైక్యలో పనిచేస్తున్న అటెండర్స్ కు వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డి ఆర్ డి ఓ పిడి శేఖర్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు . ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండల మహిళ సమైక్యాలు ఏర్పడిన నాటి నుండి కొంతమంది,20 సంవత్సరాలుగా కొంతమంది తక్కువ వేతనాలతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలో అటెండర్స్ కి 2వేలు నుండి 6వేలు వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఈ వేతనాలు సరిపోక వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వీరికి గుర్తింపు కార్డులు, పిఎఫ్ ,ఈఎస్ఐ, ప్రమాద బీమా యూనిఫాం క్యాజువల్ సెలవులు అమలు కావడం లేదని కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే వీళ్ళ వేతనాలు పెంచే విధంగా ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల అటెండర్స్ అందరూ పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పులకరం నారాయణ, జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు, సైదమ్మ, నాగమ్మ, ఎల్లమ్మ, కమలమ్మ,సరిత, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.


HYD : వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు. ఈనెల 22న మహిళా కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశం. నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలపై నోటీసులు. తన భర్తకు సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసిన వేణుస్వామి భార్య వాణి. మీడియాపై వేణుస్వామి భార్య వాణి ఆగ్రహం.
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరెస్ట్
సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి
మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు
బ్రాహ్మణ సేవాసమితి జిల్లా కమిటీ ఎన్నిక
శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద
హైదరాబాద్‌లో సీజనల్ వ్యాధుల టెన్షన్. రోగులతో కిక్కిరిసిపోతున్న ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు. రోజు రోజుకి పెరుగుతున్న డెంగ్యూల కేసులు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్‌లో విపరీతంగా OPలు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో వెయ్యికి చేరుకున్న OP. OP విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత. బదిలీలతో వైద్యుల కొరతు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఆస్పత్రులు. ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ.
రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలి
Aug 13 2024, 17:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.0k