Ts: సర్పంచి ఎన్నికలు త్వరగా పూర్తి చేయండి: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ
సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి
వీలైనంత త్వరగా పూర్తి చేయండి
రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ
గ్రాంట్ల రిలీజ్ చిక్కులతో అడ్వయిజరీ జారీ
కసరత్తు మొదలు పెట్టిన రాష్ట్ర అధికారులు
పంద్రాగస్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఆ తర్వాతే స్థానిక సమరంపై మరింత క్లారిటీ
రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ లేఖ రాసింది. రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నందున కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలనా వ్యవస్థ ఉండడం అనివార్యం కావడంతో కేంద్రం ఈ లేఖ రాసినట్టు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే సారి నిర్వ హించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ చిక్కు లున్నందున రాష్ట్ర బీసీ కమిషన్, పంచాయ తీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో ఇప్పటికే సీఎం సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు. ఆ మూడు విభాగాల అధికారులకు వర్క్ డివిజన్ చేసి వీలైనంత తొందరగా ఎన్నికల నిర్వహణపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక సీఎం విదేశీ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నది.

సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి

మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు
బ్రాహ్మణ సేవాసమితి జిల్లా కమిటీ ఎన్నిక
శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద
హైదరాబాద్‌లో సీజనల్ వ్యాధుల టెన్షన్. రోగులతో కిక్కిరిసిపోతున్న ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు. రోజు రోజుకి పెరుగుతున్న డెంగ్యూల కేసులు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్‌లో విపరీతంగా OPలు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో వెయ్యికి చేరుకున్న OP. OP విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత. బదిలీలతో వైద్యుల కొరతు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఆస్పత్రులు. ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ.
రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలి
HYD : డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయి. గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయి అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు. లావణ్య, రాజ్‌తరుణ్ కేసులోనూ వినిపించిన మస్తాన్ సాయి పేరు. మస్తాన్ సాయి ఫోన్‌లో అమ్మాయిల వీడియోలు గుర్తింపు. పలువురు అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసిన మస్తాన్ సాయి.
నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా చేనేత సెల్ కో కన్వీనర్ కటకం శ్రీధర్ గారి ఆధ్వర్యంలో

Aug 13 2024, 10:18
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.9k