నల్లగొండ: బ్రాహ్మణ సేవా సమితి జిల్లా కమిటీ ఎన్నిక.. నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సిరి ప్రగడ శ్రీనివాస శర్మ..
బ్రాహ్మణ సేవాసమితి జిల్లా కమిటీ ఎన్నిక
తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి జిల్లా కమిటీని సోమవారం జిల్లా కేంద్రంలోని గొల్లగూడ రామాలయంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా సిరి ప్రగడ శ్రీనివాస్ శర్మ, జిల్ల ప్రధాన కార్యదర్శిగా వేదాంతం కృష్ణ చరణ్ చార్యులు, ఉపాధ్యక్షులు పసునూరి రాంబాబు,సిరిప్రగడ ఆనందరావు,గాదె గిరిధర్ రావు, సహాదు కార్యదర్శ్మి గా కంజర్ యశ్వంత్ చార్యులు, కోశాధికారిగా కలాహలం సంజయుచార్యులు, ప్రచార కార్యదర్శి రంగరాజు జగదీష్, కార్యవర్గ సభ్యులు మారేవల్లి వెంకటాచార్యులు, గాదె మురళి కృష్ణ మడపు సంతోష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ ఆదేశాల మేరకు ఈరోజు కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీ జిల్లా పేద బ్రాహ్మకుల కోసం ఎల్లవేళలు అందుబాటులు ఉండి అందరికి సహయ సహకారలు అందించి కమిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి లతోపాటు జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ లు రాష్ట్ర మంత్రులు తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎంతోమంది బ్రాహ్మణులు వెనకబడి ఉన్నారని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అవకాశం కల్పించి బ్రాహ్మణ కులానికి చెందిన విద్యార్థులకు విదేశీ చదువుల కోసం ఆర్థికంగా ప్రోత్సహించాలని కోరారు.
Aug 13 2024, 07:44