/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png
ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం
తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనున్న ప్రభుత్వం.
కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.
ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను ప్రారంభించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్… రేపే నిర్ణయం?
ఆయా రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళన దిశగా ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించబోతోంది.
ఎనిమిది రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లను మార్చాలని నిర్ణయించిన హైకమాండ్..
మంగళవారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై చర్చించడంతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.
కీలకమైన ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతోపాటు ఆయా రాష్ట్రాల ఇంచార్జ్ లు, సీనియర్ నేతలు హజరు కానుండటంతో ఈ సమావేశంలో ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర, జార్ఖండ్ , హర్యానాతోపాటు జమ్మూ కాశ్మీర్ లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, వచ్చే ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడం, ఎన్నికలకు పొత్తులతో వెళ్లడమా? లేక ఒంటరిగానే ముందుకు వెళ్లడమా అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. గత కొద్ది నెలలుగా పీసీసీల మార్పుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నా ఓ కొలిక్కి రావడం లేదు. మరికొంతకాలం జాప్యం చేస్తే ఆయా రాష్ట్రాల్లో క్యాడర్ కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. దీంతో పీసీసీల మార్పుపై నాన్చివేత వైఖరికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆయా రాష్ట్రాలకు కొత్త సారథులను నియమించాలని హైకమాండ్ డిసైడ్ అయింది. ఏకాభిప్రాయం కుదిరితే ఏడు రాష్ట్రాలకు రెండు రోజుల్లో పీసీసీ అధ్యక్షులపేర్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది. అయితే, విదేశీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ ఉండటంతో..టి.పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది రేపే తేల్చేస్తారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడి విషయంలో రేవంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని.. మరోసారి రేవంత్ తో చర్చించి తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ ఎవరనేది ప్రకటించనున్నారని తెలుస్తోంది.
Breaking ; ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ ?
- నేడు సుప్రీంకోర్టులో విచారణ
- జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందుకు దరఖాస్తు
- సిసోడియాకు బెయిల్ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్గాల్లో ఆశలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(క్రిమినల్) దాఖలు చేశారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నాయి. అందులో కవిత మాత్రమే మహిళ. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయి.
మహిళా చట్టాలను పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వండి. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదు. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి.
వాటి కింద కవితకు బెయిల్ ఇవ్వాలి’’ అని కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇరుపక్షాల సుధీర్ఘ వాదనల తర్వాత కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ కొట్టేశారు.
ఇప్పుడు కవిత అవే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారించనుంది.
ఇదే ధర్మాసనం శుక్రవారం ఢిల్లీ మద్యం కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. ఈసారి తమ నాయకురాలికి తప్పనిసరిగా బెయిల్ వస్తుందని బీఆర్‌ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె నాటి నుంచి తిహాడ్ జైలులో ఉన్నారు. కవిత తిహాడ్ జైలులో ఉండగానే ఏప్రిల్ 15న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది.
Breaking ; వినేశ్ కేసు..13న తీర్పు !
వినేశ్ ఫొగట్ కేసు తీర్పుపై సస్పెన్స్ మరో రెండు రోజులు కొనసాగనుంది. తనపై అనర్హత వేటును భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానం (సీఏఎ్‌స)లో సవాలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఏఎస్ అడ్‌హాక్ డివిజన్ ఎదుట శుక్రవారం వాదనలు జరిగాయి. వినేశ్ తరపున ఫ్రెంచ్ లాయర్లు, భారత ఒలింపిక్ సంఘం తరపున హరీశ్ సాల్వే, విధుష్పత్ సింఘానియా, అలాగే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
కాగా..సీఏఎస్ శనివారం తన తీర్పు వెలువరిస్తుందని భావించారు. అయితే ఒలింపిక్స్ ముగిశాక తీర్పు వెల్లడించాలని అడ్‌హాక్ కమిటీ నిర్ణయించినట్టు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఆర్బిట్రేటర్ జస్టిస్ అనాబెల్ బెనెట్ తీర్పు వెలువరించనున్నట్టు పేర్కొంది.
ఆర్టీసీ కార్గోలో రాఖీలు..!
- 24 గంటల్లో చేరేలా చర్యలు
ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దూర ప్రాంతాల్లో ఉన్న తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు పంపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రిని కూడా పంపే అవకాశం కల్పించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొన్నారు.
ఇందుకోసం అన్ని బస్టాండ్లలోని కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్గో సెంటర్లలో బుక్ చేసిన 24 గంటల్లోనే రాఖీలను డెలివరీ చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కార్గో అధికారులు కౌంటర్లు తెరవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాకపోవడంతో ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి ఉన్నారు. రాఖీల రవాణకు సంబంధించిన ధరల విషయంలో సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అధికారులపై ఎమ్మెల్యే కడియం ఆగ్రహం !
- 1200 మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలే...
ఒకే మండలంలో 1200 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వారంతా ఆందోళనలో ఉన్నారు. మేం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకంపై పర్యవేక్షణ సరిగా లేదు. మీ వల్ల ప్రభు త్వం బద్నాం కావాలా?’ అంటూ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లీడ్‌బ్యాంక్, వ్య వసాయశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం జనగామ కలెక్టరేట్ లో లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, నవాబ్‌పేట గ్రామాల రైతుల రుణమాఫీలో తలెత్తిన సాంకేతిక సమస్యపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేశ్‌కుమార్, రోహిత్‌సింగ్, లీడ్‌బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో కలిసి సమీక్షించారు.
తన నియోజకవర్గ పరిధిలోని నవాబ్‌పేటకు చెందిన 800 మంది, నెల్లుట్లకు చెందిన సుమారు 400 మంది రైతులకు కెనరా బ్యాంక్ ద్వారా రుణమాఫీ కాలేదని, దీనికి ఎవరు బాధ్యులు అని కడియం మండిపడ్డారు.‘మీపర్యవేక్షణ లోపం వల్ల మేం బద్నాం కావాలా?’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని కలెక్టర్‌ను కోరారు.
Breaking ; కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి‼️
- సచివాలయంలో కొనసాగుతున్న సమీక్ష సమావేశం
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. శనివారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు దామోదర రాజానరసింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరు కానున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలు ఖరారు చేయనుంది.
ఆగస్టు 1వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు?
APలో 10,960 గ్రామ, 4044 వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు, చేర్పులు జరిగే ఛాన్సుంది.
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అందులోని కార్యదర్శులను ఇతర అవసరాలకు వాడుకునేలా కసరత్తు చేస్తోంది.
సచివాలయాల్లో ANM, VRO, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ, మహిళా సంరక్షణ కార్యదర్శి ఉండేలా యోచిస్తోంది.
గ్రామ సచివాలయ కార్యదర్శులను పంచాయతీరాజ్ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్
సిసోడియా బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
విచారణ లేకుండానే జైల్లో ఉంచడానికి వీల్లేదు
విచారణ వేగవంతంగా జరగాలని కోరడం పిటీషనర్ హక్కు
ట్రయల్ కోర్టు, హైకోర్టు అంశానికి ప్రాధాన్యం ఇవ్వాల్సింది
సిసోడియాను మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడమంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమే అన్న న్యాయమూర్తులు
Aug 13 2024, 07:34