నల్లగొండ: రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి: దళిత బంధు సాధన సమితి
రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలి
రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వినతి పత్రం అందజేసి, అనంతరం దళిత బంధు సాధన సమితి నాయకులు బడుపుల శంకర్, కందుల లక్ష్మయ్య మాట్లాడుతూ..
గత ప్రభుత్వం నిరుపేద దళితులను గుర్తించి ఆర్థిక భరోసగా దళిత బంధులో లబ్ధిదారులుగా ఎంపిక చేసిందని తెలిపారు. ఎంపిక సమయంలో ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల నుండి వాటికి సంబంధించిన అన్ని పత్రాలను తీసుకొని పరిశీలన చేసి దళిత బంధు పోర్టల్ లో పేర్లను నమోదు చేశారని పేర్కొన్నారు. బ్యాంకులో కూడా దళిత బంధు లబ్ధిదారులతో జీరో ఎకౌంటును తీయించారని వెల్లడించారు. దళిత బందులో నిధులను విడుదల చేశారని, లబ్ధిదారులకు రూ. 10 లక్షలు జమాయ్యాయి. గ్రౌండింగ్ జరిగే లోపు ఎన్నికల నియామవళి రావడంతో లబ్ధిదారులకు గ్రౌండిగ్ చేయలేదన్నారు. ఎన్నికల తర్వాత గ్రౌండిగ్ చేస్తారు అనుకున్నాం కానీ ఎకౌంటు లను ఫ్రీజింగ్లో పెట్టి ఇప్పటివరకు గ్రౌండిగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి దళిత జాతికి రావాల్సిన దళిత బంధు నిధులను విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దళిత బంధు కోసం సాగే పోరాటంలో దళిత బంధు లబ్ధిదారులంతా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పోతేపాక నవీన్, దొడ్డి రమేష్, పుల్లెంల ఏడుకొండలు, కొప్పోలు విమలమ్మ, మామిడి ఎల్లయ్య, పేరపాక నరసింహ, అద్దంకి రవీందర్, బాకి నరసింహ, బొజ్జ శ్రీను, బొజ్జ సురేష్, దర్శనం రాంబాబు, అప్పల మధు, ఉదారి శ్రీకాంత్, కొండేటి నాగయ్య, బాలస్వామి, చింతకింది సైదులు, పోలే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Aug 13 2024, 06:55