**ధోని శిష్యుడితో పాటు కేఎల్ రాహుల్‌పై వేటు.. జట్టులోకి ధనాధన్ కుర్రాళ్లు**
మూడో వన్డేకి భారత తుదిజట్టు ఇదే.శ్రీలంకతో వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ బుధవారం జరగనుంది. మొదటి వన్డే టై కాగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ డ్రా చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తుండగా, ఆతిథ్య జట్టు కూడా గెలుపే లక్ష్యంగా గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది.
1997 తర్వాత శ్రీలంక, భారత్‌పై వన్డే సిరీస్ గెలవలేదు. ఇప్పుడు ఆ లోటు పూడ్చుకునే అవకాశం వారికి దక్కింది. అయితే మూడో మ్యాచ్‌లో ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉండే అవకాశం ఉందో చూద్దాం. ఓపెనింగ్, టాప్ ఆర్డర్ టీమ్ ఇండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌ల్లోనూ దూకుడుగా ఆడాడు. పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీలు బాదాడు. కానీ ఈ ఆరంభాన్ని టీమ్ ఇండియా సరిగా ఉపయోగించుకోలేదు. మిగతా బ్యాటర్లు ఫెయిల్ అవ్వడంతో తక్కువ స్కోర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, భారత మిడిల్ ఆర్డర్ మొత్తం తడబడింది. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే అందరూ నిరాశపరిచారు.
అయితే మూడో వన్డేలో కోహ్లి, అయ్యర్ ఇద్దరూ తుది జట్టులో ఉండవచ్చు. కానీ రాహుల్, దూబేను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. మొదటి వన్డేలో రాహుల్ 31 పరుగులు చేసినా, టీమ్‌ను గెలిపించలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో డక్ ఔట్ అయ్యాడు. శివమ్ దూబే స్పిన్నర్లపై బాగా ఆడతాడనే అంచనాలు ఉన్నా, అతడు అంచనాలకు తగ్గట్లు రాణించలేదు. మొదటి వన్డేలో దూబే 25 పరుగులు చేశాడు, కానీ రెండో వన్డేలో డక్ ఔట్ అయ్యాడు. గంభీర్, రోహిత్ జట్టు కూర్పు మార్చాలనుకుంటే.
రాహుల్, దూబేలకు బ్యాకప్ ఆప్షన్స్‌గా ఉన్న రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌ను ఫైనల్ ఎలెవన్‌లోకి తీసుకోవచ్చు. పరాగ్‌కు ప్లస్ రియాన్ పరాగ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. టీ20 సిరీస్‌లో అతడి బౌలింగ్ స్కిల్స్ బయటపెట్టాడు. శ్రీలంక వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతున్నాయి. ఇక్కడి స్లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే రెండో వన్డేలో శ్రీలంక కేవలం ఒకే ఒక్క పేసర్ అసిత ఫెర్నాండోతో ఆడింది.
భారత్ కూడా ఇదే గేమ్ ప్లాన్ ఫాలో కావచ్చు. టీమ్ ఇండియా ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో ఆడుతోంది. వీరికి పరాగ్ తోడైతే, లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎదుర్కొనే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దూబే ప్లేస్‌లో రియాన్ పరాగ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. రాహుల్‌ను తీసేస్తారా?
రెండు వన్డేల్లో టీమ్ ఇండియా బ్యాటర్లు దూకుడుగా ఆడలేదు. అందుకే అగ్రెసివ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు చివరి మ్యాచ్‌లో అవకాశం రావచ్చు. కానీ రాహుల్‌ను తప్పించడం తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే గత ఏడాది అతడు 66.25 యావరేజ్, 87.74 స్ట్రైక్ రేట్‌తో 1060 రన్స్ సాధించాడు. ఐదో స్థానంలో ఆడే ఈ కర్ణాటక బ్యాటర్ నిలబడితే, మ్యాచ్‌ను ఈజీగా గెలిపించగలడు. అంతేకాదు, రాహుల్ స్పిన్ బౌలింగ్‌లో చాలా బాగా ఆడతాడు.
అందుకే మూడో వన్డేల్లో పంత్ లేదా రాహుల్ ఇద్దరిలో ఎవర్ని ఆడించాలనేది డిసైడ్ అవ్వడం గంభీర్, రోహిత్‌కు కష్టంగా మారనుంది.
Aug 07 2024, 16:41