Andhra Pradesh: ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీబిజీ
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారు
ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా అధికారులతో సమావేశం కానున్నారు..
ఉదయం పది గంటలకు కలెక్టర్లతో భేటీ కానున్నారు. కలెక్టర్ల సదస్సులో ప్రారంభోత్సవం చేయనున్నారు సీసీఎల్‌ఏ జయలక్ష్మి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్.
కలెక్టర్లను ఉద్దేశించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడనున్నారు. ఆతర్వాత ప్రాధాన్యతను బట్టి ముందుగా వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలు, ఆక్వా, అటవీశాఖలపై సమీక్ష జరపనున్నారు.
అనంతరం గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు.
ఆ తర్వాత గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు మౌలిక సదుపాయల కల్పనపై సమీక్ష జరపనున్నారు. లంచ్ తర్వాత పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ శాఖలు, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య, పురపాలక శాఖలపై చర్చించనున్నారు.
చివరిగా రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు, శాంతి భద్రతలపై సమీక్ష చేయనున్న సీఎం. సాయంత్రం ఎస్పీలతో శాంతి భద్రతలపై చర్చించనున్నారు. సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, HODలు మినహా ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు.
సీఎం, డిప్యూటీ సీఎం పేషీ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ , హోం శాఖల మంత్రులు, డీజీపీ, సీఎస్ సిబ్బంది మినహా మరెవరూ కలెక్టర్ల సదస్సు సమావేశ హాలుకు అనుమతి లేదని చెప్పారు.
కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత ప్రజెంటేషన్లను వారే తెచ్చుకోవాలని సూచించారు. నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పెట్టుకోవాలని సూచనలు చేశారు.
Aug 05 2024, 09:25