30 ఏళ్లుగా MRPS పోరాటం !
MRPS)కు ధర్నాచౌక్ అడ్డాగా మారింది. 30 ఏళ్ల పాటు జరిగిన వర్గీకరణ పోరాటంలో ఎన్నో ఆందోళనలు ఇక్కడే జరిగాయి. రిజర్వేషన్ల వర్గీకరణకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7న ఉద్యమాన్ని ప్రారంభించింది.
నాటి నుంచీ ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) సారథ్యంలో ధర్నాచౌక్ వేదికగా అనేక ఉద్యమాలు కొనసాగాయి.
ఇందిరాపార్కు వద్ద గల ధర్నాచౌక్(Dharnachowk)లో అనేక నిరాహారదీక్షలు, చలో హైదరాబాద్, చలో సచివాలయ ముట్డడి వంటి కార్యక్రమాలు జరిగాయి.
వర్గీకరణ కోసం ధర్నాచౌక్‌లో ఉదయం 11 గంటలకు మహాధర్నా ప్రారంభమై రాత్రి ఏడు గంటల వరకూ ఆందోళనలు కొనసాగిన సందర్భాలు ఉన్నాయి.
ఓసారి నిరాహార దీక్ష మొదలుపెట్టిన మందకృష్ణ(Mandakrishna) దానిని అమరణ దీక్షగా మార్చడంతో రెండు మూడు రోజుల పాటు ఆందోళనలు కొనసాగాయి.
ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాత్రికి రాత్రే పోలీసులు ఆస్పత్రికి తరలించి అక్కడ ఉన్న ఆందోళనకారులను అరెస్టు చేశారు.
పోరాటం ఫలించడంతో గతంలో ఆందోళనల్లో పాల్గొన్న ఎంఆర్‌పీఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఇందిరాపార్కు వద్ద గురువారం సంబరాలు జరుపుకున్నారు.
Aug 05 2024, 09:22