ఎస్సీ హాస్టల్ కు సొంత భవనం నిర్మించాలి: కెవిపిఎస్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం:
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మునుగోడు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడెం మండల కేంద్రంలో ఎస్టీ,ఎస్సీ బాలుర హాస్టల్ కెవిపిఎస్ మునుగోలు నియోజకవర్గం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా KVPS జిల్లా ఉపాధ్యక్షులు బొట్టు శివకుమార్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తక్షణమే ఎస్టీ హాస్టల్ కు ప్రహరి గోడ నిర్మాణం చేయాలి, ఎస్సీ హాస్టల్ కు సొంత భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమస్యల వలయంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని, తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని కెవిపిఎస్ తరపున డిమాండ్ చేశారు. ప్రస్తుతం అద్దె భవనం ఉంటున్న ఎస్సీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు సరైన రీతిలో లేవు.ఎస్టీ హాస్టల్లో ఇంకా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు.
తక్షణమే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బాణావత్ దేవా, మిట్టపల్లి ఆనంద, పర్వతం కిరణ్ కుమార్, సైదులు, నరసింహ, యాకోబు, యాదయ్య, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Aug 03 2024, 18:37