NLG: ఉన్నత విద్య -పరిశోధన విధానం పై పుస్తకావిష్కరణ
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల లో "ఉన్నత విద్య -పరిశోధన విధానం" పై పుస్తకావిష్కరణ కళాశాల గ్రంథాలయ సమాచార కేంద్రం, గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ రచించిన పుస్తకాలు పరిశోధన విధానం, మరియు ఉన్నత విద్యలో ఎలక్ట్రానిక్ సమాచార వనరులు పై పుస్తకాలు రచించి ప్రచురించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మరియు అధ్యాపకుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది.
పుస్తక రచయిత డాక్టర్ ఆనంద్ దుర్గాప్రసాద్, కళాశాల గ్రంథపాలకులు మాట్లాడుతూ.. పరిశోధన విధానం పుస్తకం విద్యార్థులకు పరిశోధన, వివిధ రంగాలలో నూతన మార్పులు- సమస్యలకు పరిశోధన ఎలా చేయాలనేటువంటి అంశాలపై పూర్తిగా సమాచారం ఈ రీసెర్చ్ మెథడాలజీ అనే పుస్తకంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్క భారతీయుడు కంప్యూటర్, మొబైల్ ద్వారా ఇంటర్నెట్లో ఉచితంగా సమాచారాన్ని ఎలా వెతకాల్లో, ఏవిధంగా ఉపయోగించుకోవాలో వెబ్సైట్లు, ఎలక్ట్రానిక్ బుక్స్,ఎలక్ట్రానిక్ జర్నల్స్ సమాచార వనరులు ముఖ్యంగా ఉన్నత విద్యలో సాహిత్యం, సాంకేతికత, పరిశోధన వ్యాసాలపై సమాచారము ఈ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్-పరిశోధన విధానం అనే పుస్తకాలలో విపులంగా సమాచారం అందుబాటులో ఉన్నదని తెలిపారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు , పరీక్షల నియంత్రణ అధికారి బి.నాగరాజు, డాక్టర్.కృష్ణ కౌండిన్య, డాక్టర్ దీపిక, డాక్టర్ నారాయణరావు, డాక్టర్ బాలస్వామి, డాక్టర్ యాదగిరి, డాక్టర్ యాదగిరిరెడ్డి, యాదగిరిరావు, నాగిరెడ్డి, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ నారాయణ రావు, ముత్తయ్య, నాగరాజు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, చంద్రయ్య, అసిస్టెంట్ లైబ్రేరియన్ మణెమ్మ, గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ సూదిని వెంకటరెడ్డి తదితరులు కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Aug 02 2024, 21:45