చారుమతి చైల్డ్ కేర్ సెంటర్, ప్రభుత్వ ఎస్టి హాస్టల్లో లో పండ్లు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ
నల్గొండ: బైకాని శ్రీశైలం యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పానగల్ లోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో విద్యార్థిని విద్యార్థులకు పండ్లు మరియు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న JBS ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మల్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక సేవ చేయడం అనేది ఎంతో అదృష్టమని తెలియజేస్తూ, ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్ మాజీ విద్యార్థి, మా శిష్యుడు మారేపల్లి అర్జున్ ఆధ్వర్యంలో ఎమరాల్డ్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ బైకానీ శ్రీశైలం యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమంలో విద్యార్థులకు ఈ రకమైన సేవ చేసే అవకాశాన్ని చేతబూనడం చాలా సంతోషదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు కూడా చేపట్టాలని తెలియజేస్తూ, విద్యార్థులకు పండ్లు నోట్ బుక్స్ & పెన్నులు పంపిణీ చేసి అనంతరం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరొక ముఖ్య అతిథి చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. బైకానీ శ్రీశైలం యాదవ్ ఉన్నత చదువులు చదువుకొని, కన్స్ట్రక్షన్ రంగంలో రాణిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటాడని తెలియజేస్తూ ఎంతోమంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ తను ఎన్నుకున్నరంగంలో రాణిస్తున్నాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ హాస్టల్ వార్డెన్ రామకృష్ణ, మారేపల్లి అర్జున్, మారేపల్లి మనోజ్, అక్కినపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Jul 30 2024, 17:04