/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz *నేను నా మిర్యాలగూడ స్వచ్చంధ కార్యక్రమాలకు ప్రైవేటు టీచర్స్ సహకారాలు కూడా అందించండి..MLA -BLR* janardhanreddy vemula
*నేను నా మిర్యాలగూడ స్వచ్చంధ కార్యక్రమాలకు ప్రైవేటు టీచర్స్ సహకారాలు కూడా అందించండి..MLA -BLR*
ఈరోజు మిర్యాలగూడ MLA క్యాంప్ కార్యాలయం నందు ప్రైవేటు స్కూల్ టీచర్స్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ. మిర్యాలగూడ నియోజకవర్గ పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కాలుష్య నియంత్రణ లక్ష్యంతో నిర్వహిస్తున్న నేను నా మిర్యాలగూడ స్వచ్చంధ కార్యక్రమాలు అయిన *వన మహోత్సవం* కార్యక్రమానికి మరియు *ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ* కార్యక్రమానికి ప్రైవేటు ఉపాధ్యాయులు అందరూ తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.. ప్రతీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు విద్యార్థులలో అవేర్నెస్ తీసుకొని రావాలి. వారి వారి ఇండ్లలో మొక్కలు నాటమని తెలియజేయండి . అలాగే *ఆగస్టు 1వ తేది* నుంచి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచనలు చేసి వాటి వలన జరిగే పర్యావరణ కాలుష్యాని విద్యార్థులకు బోధించాలి ... అదే విధంగా ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *78 వ స్వతంత్ర దినోత్సవ* వేడుకల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అందరూ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణలో వారిని కూడా భాగస్వామ్యులు చేయడం చాలా ఆనందంగా ఉంది.. మేము అందరం కూడా నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో చేయబోయే ప్రతీ ఒక్క స్వచ్చంధ కార్యక్రమానికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు స్కూల్స్ ప్రధాన ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
*ప్లాస్టిక్ కవర్ల నియంత్రణకు మీ అందరూ సహకరించాలి , వ్యాపారులతో MLA -BLR*
మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*. *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న మరో స్వచ్చంధ కార్యక్రమం నియోజకవర్గంలో *ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ* ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిర్యాలగూడలోని ప్లాస్టిక్ కవర్స్ హోల్సేల్ వ్యాపారులను మరియు మార్కెట్ లోని కూరగాయలు మరియు పలు వ్యాపారులను కలసి *ఆగస్టు 1వ తేదీ* నుంచి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని, మరియు అమ్మకాలను పూర్తిగా తగ్గించాలని , *7వ తేది* వరకు మార్కెట్ లో ప్లాస్టిక్ కవర్ అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత మీదే.

*ఆగస్టు 15 వ* తేది వరకు మిర్యాలగూడ నియోజకవర్గం పూర్తి ప్లాస్టిక్ కవర్ల రహితంగా మారాలని.. దాని కోసం మాతో పాటు మీరు కూడా సహకరిస్తే అందరం కలసి మిర్యాలగూడ నియోజకవర్గం పర్యావరణ పరిరక్షణలో భాగం అవ్వాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు.. తదితరులు పాల్గొన్నారు.
*మూసి కుడి కాలువ నీటి విడుదల ద్వారా రైతుల హర్షం..MLA -BLR*
ఈరోజు మూసి కుడి కాలువ ద్వారా పంటపొలాలకు నీటి విడుదల ను చేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే గౌ,, శ్రీ వేముల వీరేశం గారు ,DCMS చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, ప్రాజెక్టు SE, EE, DE,AE , ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ * ఈ మూసి కుడి కాలువ ద్వారా *అమనగళ్ళు, కల్వేలపాలెం, చిరుమర్తి, పొరెడ్డి గూడెం, పాములపాడు, భీమనపెల్లి, లక్ష్మిదేవి గూడెం, రావులపెంట* గ్రామాలకు సాగు నీరు అందడం జరుగుతుంది.
➡️ఆయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా సాగు నీరు అందిస్తాం ➡️ప్రతి ఎకరానికి నీరు అందజేయడమే లక్ష్యం ➡️నీటి విడుదలతో ఆయకట్టు రైతుల హర్షం వ్యక్తమవుతోంది. ➡️ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా రైతుల పక్షాన ధన్యవాదాలు.
*బడ్జెట్ తర్వాత మద్యం ధరల సంగతేంటి* ? మందుబాబులకు లక్కా..? కిక్కా..?
బడ్జెట్ తర్వాత ప్రతిసారీ మద్యం ప్రియులు బడ్జెట్‌ను అనేక విషయాలను నిశితంగా చూస్తారు. ముఖ్యంగా బడ్జెట్‌లో మద్యం ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని ఈసారి ఓ కన్నేసి ఉంచారు. దీనికి సంబంధించిన అప్‌డేట్ చూసి హ్యాపీగా ఉన్నారు. మోదీ సర్కారు 3.0లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024లో అన్నీ వర్గాలకు మేలు చేసేలా కేటాయింపులు చేశామని ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే అందులో ఎంత వాస్తవం ఉంది..అన్నింటి కంటే ముఖ్యమైన మద్యం ధరలపై కేంద్ర సర్కారు ట్యాక్సులు పెంచిందా లేక తగ్గించిందా అనే సందేహాలు ప్రతీ ఒక్కరిలో ఉన్నాయి.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మద్యం ధరలు పెరిగాయా లేక తగ్గాయా అని సురాపాన ప్రేమికుల్లో ఒకటే టెన్షన్ ఉంది. అయితే వారి ఆశలపై మాత్రం కేంద్రం ఊరటనిచ్చే విధంగానే నిర్ణయం తీసుకుంది. మంగళవారం, జూలై 23, BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వం మూడవ ప్లీనరీ బడ్జెట్ సెషన్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.బడ్జెట్‌ ప్రకటన వెలువడగానే సామాన్యుల మదిలో మెదులుతున్న మొదటి ప్రశ్న ఏయే ఉత్పత్తుల ధరలు పెరిగాయి, ఏయే ఉత్పత్తుల ధరలు తగ్గాయి? ఇందులో సిగరెట్ మరియు మద్యం ధర ఉంది.

ఈసారి బడ్జెట్‌లో సుర ప్రియులకు శుభవార్త. ఎక్సైజ్ సుంకం లేదా ఎక్సైజ్ సుంకంలో ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్ట మార్పులను కూడా ప్రకటించలేదు. దీంతో మద్యం ధర పెరగడం లేదని తెలిసింది. యాదృచ్ఛికంగా, మద్యం ధర మాత్రమే కాదు, సిగరెట్ సహా పొగాకు ఉత్పత్తుల ధరలను కూడా బడ్జెట్‌లో పెంచలేదు. జీఎస్టీ పెంపు వల్ల పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం చేయలేదు.
* ఏపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం..ఆశలపై నీళ్లు*
2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడే విధంగా బడ్జెట్‌ రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 3.0 బడ్జెట్‌ను తయారు చేశామని.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని, ద్రవ్యోల్బణం తగ్గుతోందని ఆమె తెలిపారు. బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు అధిక స్థాయిలో కేటాయింపులు దక్కాయి. ముఖ్యంగా ఏపీ రాజధాని అభివృద్దికి ప్రత్యేకంగా రూ. 15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ, జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ క్రెడిట్ కోసం ఇరు పార్టీల నేతలు పోటీ పడ్డారు. తమ వల్లే ఈ కేటాయింపులని టీడీపీ నేతలు అంటుంటే, పవన్ వల్లే ఇంతటి స్థాయిలో నిధులు వచ్చాయంటూ జనసేన నేతలు చంకలు గుద్దుకున్నారు. తీరా ఇది సాయం కాదు అప్పుగా మాత్రమే ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే అసలు విషయం తర్వాత కానీ తెలియలేదు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ , ఏపీకి కేటాయించిన బడ్జెట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో ఉందని కేంద్ర మంత్రి అంటూనే దాని ప్రకారం రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. అంటే ప్రపంచ బ్యాంక్ ద్వారా ఆర్ధిక సాయం అందేలా చూస్తామని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ అంటే రుణాలు ఇచ్చేదే తప్ప ఉచితంగా ఇవ్వదు. మరి ఆ విధంగా ఆలోచిస్తే ఏపీకి ఇచ్చే రూ. 15000 వేల కోట్ల రూపాయల రుణమే తప్ప ఆర్ధిక సాయం ఏ మాత్రం కాదని అర్ధం అవుతోంది.


రాష్ట్ర ప్రభుత్వానికి , వరల్డ్ బ్యాంక్‌కు మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది, అంతే తప్పిస్తే ఈ రూ. 15000 వేల కోట్లకు కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదన్న మాట. ప్రపంచ బ్యాంకు ఎవరికీ ఉచితంగా రుణం ఇవ్వదు , కాబట్టి ఈ రూ.15000 వేల కోట్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటోంది. దీనిపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. నిధులు అప్పుల రూపంలోనే అయినా వాటిని తీర్చేది 30 ఏళ్ల తర్వాతే అని కూడా చంద్రబాబు చెప్పడం విశేషం.అప్పు అయినా ముప్పయ్యేళ్ల తర్వాత తీరుస్తామని చంద్రబాబు అనడం బట్టి కేంద్రం ఈ విషయంలో ఏపీకి ప్రత్యేకంగా చేసిన సాయం ఏమిటి అన్న చర్చ సాగుతోంది.
*కార్మికులకు అద్దె గృహాల స్కీం.. మరో 3 కోట్ల కొత్త ఇళ్లు*
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(pmay) కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) బడ్జెట్ 2024(budget 2024) సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో పీఎం ఆవాస్ యోజనపై ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టిందని ఆర్థిక మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(pmay) కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) బడ్జెట్ 2024(budget 2024) సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో పీఎం ఆవాస్ యోజనపై ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టిందని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లు కొత్తగా నిర్మించనున్నట్లు తెలిపారు. ఇది సిమెంట్ రంగానికి సానుకూల వార్త. దీంతోపాటు పరిశ్రమ కార్మికులకు అద్దె ఇళ్ల పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP మోడ్) ద్వారా నిర్మిస్తారు. దీనిలో కార్మికుల కోసం అద్దె గృహాలలో డార్మిటరీ తరహా వసతి ఉంటుందని చెప్పారు.


14 పెద్ద నగరాలు ఈ క్రమంలో 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాలను అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో కోటి ఇళ్లకు అర్బన్ హౌసింగ్ ప్లాన్ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతోపాటు అర్బన్ హౌసింగ్ కోసం రూ.2 లక్షల కోట్లు అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. PMAY అర్బన్ హౌసింగ్ 2.0 కింద రూ. 10 లక్షల కోట్ల బడ్జెట్‌తో ప్రజల గృహ అవసరాలను తీర్చనున్నట్లు ఆర్థిక మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్ల విలువైన సహాయాన్ని అందిస్తుందని, ఈ హౌసింగ్ ప్రాజెక్టులకు రాయితీ ధరలను అందజేస్తుందని ఆమె తెలిపారు. వాస్తవానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా ఒక కోటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లను అందిస్తుంది. వచ్చే ఐదేళ్లలో రూ. 2.2 లక్షల కోట్ల కేంద్ర సహాయం కూడా చేర్చబడుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. ఈ పథకం కింద గృహాలు ఉన్నవారు, పేద తరగతి నుంచి వచ్చిన వారు ఈ ప్రయోజనాలను పొందుతారు.
*పేద ప్రజలకు మీ వైద్య సేవలు అందించండి... అందరం కలిసి మిర్యాలగూడ అభివృద్ది చేసుకుందాం..MLA -BLR*
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో *IMA మిర్యాలగూడ* వారు నిర్వహించిన మిర్యాలగూడ నియోజకవర్గ డాక్టర్స్ సమావేశంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ శ్రీ,, బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*. మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలంలో విష జ్వరాలు అధికంగా పెరిగే అవకాశం ఉన్నందున మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం పై డాక్టర్స్ యొక్క బాధ్యత అధికంగా ఉంది.. కావున అనారోగ్యంతో వచ్చిన పేసెంట్ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక బాధ్యతతో వారికి సమహకరించాలని ప్రతిఒక్క డాక్టర్ నీ కోరడం జరుగుతుంది .. అలాగే టెస్ట్ లు అవసరమైన వరకు తప్ప అధికంగా రాసి ప్రజలకు ఆర్థిక భారాన్ని పెంచకూడదు అని అన్నారు.. ఆరోగ్య కరమైన మిర్యాలగూడ నీ తీర్చి దిద్దాలి అంటే మీ సహాయ సహకారాలు మాకు చాలా అవసరం కావున గ్రామీణ ప్రాంతాలలో మీ అందరి తరుపున ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మీ సేవలను అందించడంతో పాటు.. విష జ్వరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కోరారు... అనంతరం *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ లక్ష్యంతో నిర్వహిస్తున్న *వన మహోత్సవం* కార్యక్రమంలో డాక్టర్స్ అందరూ భాగస్వామ్యులు అయ్యి తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.









అలాగే ఆగస్టు 15 న మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించబోయే *78వ స్వతంత్ర దినోత్సవ* వేడుకల్లో డాక్టర్స్ అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు... నేను నా మిర్యాలగూడ అభివృదికి నేను మీకు ఎల్లపుడూ మీకు అందుబాటులో ఉంటూ మీకు సహకరిస్తాను మీ సహకారం నాకు అందించండి మనం అందరం కలసి అభివృద్ది చేసుకుందాం అని అన్నారు.. అనంతరం IMA మిర్యాలగూడ డాక్టర్స్ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి మా డాక్టర్స్ సహాయ సహకారాలు ఎల్లపుడూ అందిస్తామని తెలియజేశారు . వన మహోత్సవం కార్యక్రమంలో తాము కూడా తమ వంతుగా మొక్కలు నటుతామని అలాగే గ్రామీణ ప్రాంతాలలో వారి వైద్య సేవలను అందిస్తామని అన్నారు... ఈ కార్యక్రమంలో DMHO గారు, IMA మిర్యాలగూడ అధ్యక్షులు, డాక్టర్స్ పాల్గొన్నారు.
*వారమంతా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, వీకెండ్స్‌లో ఆటో డ్రైవర్.. ఈ టెకీ రూటే సెపరేటు*
Software Employee: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే చాలు లక్షల్లో జీతాలు, టీమ్ లంచ్‌లు, టీమ్ టూర్లు, లగ్జరీ లైఫ్ అని చాలా మంది భావిస్తూ ఉంటారు. వారానికి 5 రోజులు పని చేస్తే చాలు.. టెక్ ఉద్యోగాలు మిగిలిన రెండు రోజులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే ఇది కొందరి విషయంలో కరెక్టే కానీ.. అందరి విషయంలో మాత్రం అలా కాదు. ఎందుకంటే ఈ టెకీ రూటే సెపరేటు. 5 రోజులు ఆఫీస్‌కు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి.. మిగిలిన రెండు రోజులు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే డబ్బులు లేక కాదు.. దాని వెనుక మరో బలమైన కారణం ఉంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అంటే ఎలా ఉంటారు. వారంలో 5 రోజుల పాటు ఆఫీస్‌లో కష్టపడి.. వీకెండ్స్‌లో పార్టీలు, పబ్‌లు, టూర్ అంటూ చిల్ అవుతూ ఉంటారు. ఇక శని, ఆది వారాలకు తోడు ఏవైనా సెలవులు ఉంటే ముందే చూసుకుని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వారంలో 5 రోజులు పడిన కష్టాన్ని.. మిగిలిన రెండు రోజులు ఎంజాయ్ చేసి.. మళ్లీ రిఫ్రెష్ అయి సోమవారం ఆఫీస్‌కు వెళ్తూ ఉంటారు.


అయితే అందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పోల్చితే ఈ టెకీ మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకంటే వారంలో 5 రోజులు ఆఫీస్‌కు వెళ్లి.మిగిలిన రెండు రోజులు ఆటో డ్రైవర్ అవతారం ఎత్తుతున్నాడు. అయితే ఆ ఆటోలో వెళ్లిన ఓ వ్యక్తి ఈ విషయం తెలుసుకుని దాన్ని కాస్తా సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పనిచేసే ఓ మైక్రోసాఫ్ట్ ఇంజినీర్‌కు సంబంధించిన కథ ఇది. ప్రస్తుతం ఆ మైక్రోసాఫ్ట్ టెకీ స్టోరీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. వారం మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఓ టెకీ.. వీకెండ్స్‌లో ఆటో డ్రైవర్‌గా మారుతున్నాడు. తాజాగా నమ్మ యాత్రి అనే యాప్‌లో కోరమంగళ ప్రాంతంలో ఆటో బుక్ చేసుకున్న ఓ వ్యక్తి.. ఆ ఆటో డ్రైవర్ వేసుకున్న హుడీ వెనకాల మైక్రోసాఫ్ట్ లోగో ఉండటం చూసి అతడ్ని అడగ్గా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తాను ఆటో డ్రైవర్‌గా ఎందుకు మారానే అనే విషయాన్ని ఆ 35 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ఉద్యోగి వెల్లడించినట్లు ఆ వ్యక్తి సోషల్ మీడియాలో వెల్లడించాడు.
మీనాక్షి చౌదరి.. ఈ స్పిడేంటి పాప!
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చైర్ కోసం పోటీ పడుతున్న అందాల భామలలో మీనాక్షి చౌదరి, శ్రీలీల టాప్ లో ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చైర్ కోసం పోటీ పడుతున్న అందాల భామలలో మీనాక్షి చౌదరి, శ్రీలీల టాప్ లో ఉన్నారు.
జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే ఈ రేసులోకి దూసుకొస్తున్నారు. శ్రీలీల అందం, అభినయంతో పాటు మంచి డాన్స్ పెర్ఫార్మర్. దీంతో మొదటి సినిమా పెళ్లి సందడి ఫ్లాప్ అయిన బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్ గా ఆమె ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ లు అందుకోలేదు. దీంతో ఇప్పుడు స్టార్ చైర్ కోసం జరుగుతున్న రేసులో వెనుకబడింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు.. సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నార్త్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఈ సినిమా అంతగా మెప్పించలేదు. తరువాత చేసిన హిట్ 2 మూవీ మంచి సక్సెస్ అయ్యింది. అక్కడి నుంచి వరుసగా అవకాశాలు పెంచుకుంటూ వస్తోంది.


ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఇళయదళపతి విజయ్ కి జోడీగా GOAT అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తెలుగులో దుల్కర్ సల్మాన్ కి జోడీగా లక్కీ భాస్కర్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. లక్కీ భాస్కర్ మూవీపైన పాజిటివ్ వైబ్ ఉంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో థియేటర్స్ లోకి రానుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ కి జోడీగా చేసిన మెకానిక్ రాకీ మూవీ రాబోతోంది. షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపొయింది. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. మెగాస్టార్ పాన్ ఇండియా మూవీ విశ్వంభరలో ఓ కీలక పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఖరారు అయ్యింది.

ఈ మూవీ కూడా 2025 సంక్రాంతికి రిలీజ్ కానుందని తెలుస్తోంది. అలాగే వరుణ్ తేజ్ కి జోడీగా మట్కా మూవీలో మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఆమె ఖాతాలో ఆరు సినిమాలు ఉంటే అందులో 4 మూవీస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే రాబోతుండటం విశేషం. ఇవి సక్సెస్ అయితే మీనాక్షి చౌదరి ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. స్టార్ హీరోయిన్ చైర్ లో కూర్చుంటుంది. అటు సీనియర్ హీరోలకి, ఇటు యంగ్ హీరోలకి సెట్ అయ్యే గ్లామర్ ఉండటంతో మీనాక్షి చౌదరికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది.
నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ శాఖలో జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త వీరికే!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిలో మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో వివ‌రించారు.


పోస్టుల వివ‌రాలు.
క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ (22). ఇలా పూర్తిగా 30 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు జౌళి శాఖ క‌మిష‌న‌ర్ శైల‌జా. అయితే, ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు IIHT నుంచి చేనేత టెక్నాలజీ (DTH )లో డిప్లొమా హోల్డర్లు అర్హుల‌ని, వీరు ఈ పోస్టుల‌ల్లో అప్లై చేసుకోవాలని శైలజా రామయ్యార్ తెలిపారు. అభ్యర్థులు మ‌రిన్ని వివరాలను తెలుసుకునేందుకు tsht.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల‌ని ఆమె సూచించారు.