NLG: బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేసేలా ఉంది: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేసేలా ఉందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ అన్నారు. ఈరోజు స్థానిక ఐబీ కార్యాలయం వద్ద బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు.
రూ. 48,20,512 కోట్ల భారీ బడ్జెట్ తో మన తెలుగింటి ఆడపడుచు నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగం, వ్యవసాయం, మహిళా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి కొరకు అధిక నిధులు కేటాయించి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన అన్నారు.
రక్షణ రంగానికి 6.22 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా ఈ దేశ రక్షణ విషయంలో తమ వైఖరిని స్పష్టం చేయడం జరిగిందని అన్నారు. యువతకు ఉపాధి నైపుణ్య అభివృద్ధి కొరకు రెండు లక్షల కోట్ల రూపాయలను, వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లు మహిళా సంక్షేమానికి మూడు లక్షల కోట్లు గ్రామీణ అభివృద్ధికి 1.77 లక్షల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి అన్ని రంగాలకు ప్రాధాన్యతలిచ్చారని అన్నారు.
రాబోయే రోజుల్లో ఆత్మ నిర్భర భారత వైపు పయనించడమే తమ లక్ష్యమని నిన్నటి బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరోసారి చాటి చెప్పిందని ఆయన అన్నారు. మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గాలకు పన్ను మినహాయింపులు ప్రకటించి ఊరట కలిగించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకురి నరసింహ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేతల వెంకటేష్ , రెడ్డి శంకర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి జల్దాభాస్కర్, గంజి హరి కుమార్, ఈడం రవికుమార్ శేఖర్ రెడ్డి, గంప పణి బిక్షపతి జాదవ్, గుండాల అంజి, బెలిదే మాధవి, అప్పం అజయ్, గడ్డం శివ, కాసుల శంకరయ్య, చిత్రం ఉదయ్ ,కర్తాల బాలు తదితరులు పాల్గొన్నారు.
Jul 26 2024, 22:12