నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు‼️
- ఆగస్టు 5 వరకు పరీక్షలు
- మొత్తం పోస్టులు 11,062
- 2.70 లక్షల మంది అభ్యర్థులు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలను గురువారం నుంచి నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 5 వరకు జరిగే ఈ పరీక్షలు కొనసాగనున్నాయి.
11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. సుమారు 2.79 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
వారిలో బుధవారం రాత్రి వరకు 2.48 లక్షల మంది తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 2.30 గంటల పాటు జరిగే పరీక్షలో 160 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 80 మార్కులు కేటాయించారు.
టెట్ ద్వారా మరో 20 మార్కులు వెయిటేజీలో భాగంగా కలపనున్నారు.
డీఎస్సీ పరీక్షలను రాష్ట్రం యూనిట్‌గా నిర్వహిస్తున్నారు. ఫలితాలు విడుదల చేసి, మెరిట్ జాబితాను మాత్రం జిల్లాల వారీగా ప్రకటిస్తారు.
నియామకాలు కూడా జిల్లా యూనిట్‌గా చేయనున్నారు. కాగా, ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఎస్‌జీటీ 6,508, భాషా పండితులు 272, పీఈటీ 182, స్పెషల్ క్యాటగిరీ స్కూల్ అసిస్టెంట్ 220, స్పెషల్ క్యాటగిరీ ఎస్‌జీటీ పోస్టులు 796 ఉన్నాయి.
Jul 23 2024, 08:45