తెలుగు రాష్ట్రాలకు కుండపోత వర్ష సూచన.. అక్కడ అతి భారీ వర్షాలు!
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. 4 రోజులపాటూ దక్షిణాది రాష్ట్రాల్లో చురుగ్గానే ఉంటాయి. దక్షిణాది వైపు వంగి ఒక ద్రోణి ఉంది. గుజరాత్, కేరళ దగ్గర మరో ద్రోణి ఉండి, గాలుల్నీ, మేఘాల్నీ ఏపీ, తెలంగాణవైపు పంపుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం అలాగే ఉంది. రెండ్రోజుల్లో అది ఒడిశా తీరంవైపు వస్తుంది. అరేబియా సముద్రంలో ఓ తుఫాను ఏర్పడుతోంది. కారణాల వల్ల వచ్చే 5 రోజులపాటూ.. ఉరుములు, మెరుపులతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. 18, 19 తేదీల్లో కోస్తా, యానంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి.
18 నుంచి 20 వరకూ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే 18 నుంచి 20 వరకూ కోస్తా, యానాంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే 18 నుంచి 21 మధ్య తెలంగాణలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
ఇదీ IMD చెప్పిన అధికారిక సమాచారం శాటిలైట్స్ లైవ్ అంచనాల్ని గమనిస్తే, కోస్తా నుంచి విశాఖపట్నం, ఒడిశా వరకూ ఒక సర్కిల్ లాంటిది తిరుగుతోంది. దాని వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, ఉత్తర తెలంగాణలో ఇవాళ రోజంతా వర్షాలు పడుతూనే ఉంటాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి పడుతున్న వాన, ఇవాళ మధ్యహ్నం 12 వరకూ పడుతూ ఉంటుంది. మధ్యాహ్నం కాకినాడ పరిసరాల్లో అతి భారీ వర్ష సూచన ఉంది. శాటిలైట్స్ లైవ్ అంచనాల్ని గమనిస్తే, కోస్తా నుంచి విశాఖపట్నం, ఒడిశా వరకూ ఒక సర్కిల్ లాంటిది తిరుగుతోంది. దాని వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, ఉత్తర తెలంగాణలో ఇవాళ రోజంతా వర్షాలు పడుతూనే ఉంటాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి పడుతున్న వాన, ఇవాళ మధ్యహ్నం 12 వరకూ పడుతూ ఉంటుంది. మధ్యాహ్నం కాకినాడ పరిసరాల్లో అతి భారీ వర్ష సూచన ఉంది. ఇంతలా వానలు పడుతున్నా.
ఇవాళ రాయలసీమలో కొంత వేడిగానే ఉంటుంది. దక్షిణ రాయలసీమలో వేడి ఫీలింగ్ ఉంటుంది. ఏపీలో ఓవరాల్‌గా యావరేజ్ వేడి 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో ఇవాళ చల్లగానే ఉంటుంది. తేమ బాగా ఉంది. ఏపీలో యావరేజ్‌గా 89 శాతం, తెలంగాణలో 81 శాతం ఉంది. ఉత్తర తెలంగాణలో 93 శాతం, ఉత్తరాంధ్రలో 94 శాతం, కోస్తాంధ్రలో 90 శాతం తేమ ఉంది. కానీ రాయలసీమలో 51 శాతమే ఉంది. అందుకే సీమలో ఇవాళ వానలు పడేలా లేవు. మొత్తంగా రెండు రాష్ట్రాల ప్రజలూ ఇవాళ జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగులతో అప్రమత్తంగా ఉండాలి.
Jul 23 2024, 07:32