భద్రాచలం: చర్ల:లింగాపురం కొత్తపల్లి గోంపల్లి పంచాయతీల రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్...
లింగాపురం కొత్తపల్లి గోంపల్లి పంచాయతీల రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్..
చర్ల మండలం లింగాపురం కొత్తపల్లి గొంపల్లి ఈ మూడు గ్రామాలకు రహదారి లేకపోవడం చిన్నవర్షం పడ్డ ఈతవాగు రావడంతో, ప్రజలకు విద్యార్థులకు వృద్ధులకు రైతులకు రాకపోకలు బంద్ అయి తీవ్ర ఇబ్బందులకు ఎదురుకుంటున్నరని *సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.
నేడు గ్రామలలోని ముఖ్యులతో పెద్ద మనుషులతో ఈత వాగును, ఆ మూడు గ్రామాల రహదారులను వారు సందర్శించి ప్రసంగించారు. సతీష్ మాట్లాడుతూ ఈ మూడు గ్రామపంచాయతీలు ఏజెన్సీలో వెనకబడ్డ ప్రాంతాలని ఇక్కడ ప్రజలకు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉందని అలాంటి ప్రజలు వర్షం రావడంతో కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు రాకపోకలు బంద్ అయి కనీస సౌకర్యాలు లేక సరుకులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. ఈ మూడు పంచాయతీల చుట్టూ గోదావరి ముంపు పొంచి ఉందని ప్రతి ఆట గోదావరి వచ్చి ఇల్లులు నీట మునుగుతున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాలలో పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని వారు అన్నారు భారత్ వెలుగుతోందని,అభివృద్ధి చెందుతుందని చెబుతూనే ఈ పాలకులు ఏజెన్సీ ప్రాంతాలని చిన్న చూపు చూస్తూ కనీసం చిన్న మోరీలు కూడా కట్టకపోవడంతో రహదారులు లేకపోవడంతో అనారోగ్యాల పాలైనటువంటి వారు గర్భవతులు మహిళలు అనేకమంది ఇబ్బందులకు గురవుతూ ఈ వర్షాకాలంలో వైద్యం అందక మరణిస్తున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు వేయాలని హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని వైద్య సౌకర్యాలు కల్పించాలని రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా తెలియజేస్తున్నాం ఈ మూడు పంచాయతీల కలిపి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించకపోతే దశల వారి ఆందోళన చేస్తామని వారి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మహిళలు యువకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Jul 20 2024, 18:48