భాగ్యనగర వాసులకు శుభవార్త.. అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్
డా చౌరస్తా వద్ద రూ. 28 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను రేపు(శనివారం 20.07.2024) ఉదయం 11.00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CMRevanth Reddy) ప్రారంభించన్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొంటారు.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. HCU బస్టాండ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు వయా వట్టినాగుల పల్లి మీదుగా గోపన్ పల్లి తండా వద్ద ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రజా సౌకర్యార్థం, ట్రాఫిక్ రహిత సమాజానికి ఫ్లై ఓవర్‌ని నిర్మించినట్లు వివరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు. గోపన్ పల్లి తండా చౌరస్తా వద్ద Y ఆకారంలో ఫ్లై ఓవర్‌ను నిర్మించినట్లు తెలిపారు. త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, ఎన్నో ఏళ్ల సమస్య పరిష్కరమవుతుందని తెలిపారు. ట్రాఫిక్ రహిత సమాజం కోసం అద్భుతమైన ఫ్లై ఓవర్ ను నిర్మించినట్లు చెప్పారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయన్నారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత , ఫ్రీ సిగ్నల్ కోసం ఫ్లై ఓవర్ చేపట్టినట్లు తెలిపారు
IT హబ్ హైటెక్ సిటీ , ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి IT ప్రాంతాలు, రద్దీ ఉండే ప్రాంతాల వారికి అన్ని హంగులతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి , ప్రజల ట్రాఫిక్ సమస్యల ఇబ్బందులను గట్టెకించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
నియోకజకర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్లు , ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తప్పకుండా ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు.
Jul 20 2024, 10:27