ప్లేస్కూల్స్ తరహా బోధన, పాఠశాలలకు రవాణా సౌకర్యం.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
తెలంగాణలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని గ్రామాల్లో 3వ తరగతి వరకు అంగన్‌వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన, ఆ తర్వాత 4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి తెలంగా విద్యా విధానంపై సమీక్ష నిర్వహించారు.

అంగన్‌వాడీల్లో ప్లేస్కూల్ తరహా బోధన
అన్ని నియోజకవర్గాల్లో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు
విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
రేపటి నుండే అమెజాన్ ప్రైమ్ డే సేల్ | మీ విష్ లిస్ట్ రెడీనా?? లేదంటే ఇప్పుడే ఆఫర్లేంటో ఒకసారి చూసెయ్యండి!
డీల్స్ చూడండి
రేపటి నుండే అమెజాన్ ప్రైమ్ డే సేల్ | మీ విష్ లిస్ట్ రెడీనా?? లేదంటే ఇప్పుడే ఆఫర్లేంటో ఒకసారి చూసెయ్యండి!
ప్రెగ్నెన్సీలో దంతాలు, చిగుళ్ళని కాపాడుకోండిలా
డీల్స్ చూడండి
ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు మారాలని, విద్యా వ్యవస్థ సమూలంగా మారాలని తల్లిదండ్రులు ఎంతో కాలంగా కోరుకుంటారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా, ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యా శాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం చేసిన పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తిగా విన్నారు.
రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులు పాఠశాలలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలు సైతం కల్పించే విధానాలను కూడా సూచించాలన్నారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌కు సమాంతరంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండాలని సూచించారు.
ప్లే స్కూళ్ల తరహాలో అంగన్‌వాడీలను నిర్వహించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. చిన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సౌకర్యవంతంగా ఉండేలా 3వ తరగతి వరకు అంగన్‌వాడీ కేంద్రాలలోనే ప్లే స్కూల్ తరహాలో విద్యా బోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అంగన్‌వాడీలలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఒక టీచర్‌ను నియమించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
పాఠశాలలకు రవాణా సదుపాయం
3వ తరగతి వరకు అంగన్‌వాడీ ప్లే స్కూల్‌లో బోధన తర్వాత విద్యార్థులు 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ దిశగా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లివచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
Jul 19 2024, 20:04