IMD: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. కమ్ముకొస్తున్న మబ్బులు
తెలుగు రాష్ట్రాలను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్న(Heavy Rains) వేళ ఐఎండీ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 4 జిల్లాల్లో, శనివారం ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది.

జులై 19న ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ పరిసర జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కుమురంభీం, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంది.
కొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ.లకు పైగా వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది.
పలు ప్రాంతాల్లో గంటకు 50కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. గురువారం ఒక్క రోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 11.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.
Jul 19 2024, 17:30