ఇంటర్ కళాశాల ఫీజులపై నియంత్రణ, మరియు కళాశాలల నిర్వహణలో లోపల గురించి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ వినతి పత్రం
నేడు నల్గొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి డిఐఈఓ దస్రు నాయక్ గారిని కలిసి వినతిపత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్
నల్గొండ జిల్లా లో ఇంటర్ కళాశాలల ఫీజులపై నియంత్రణ ఏర్పాటు చేయాలి పర్మిషన్ లేకుండా ఇంటర్ కాలేజీలు నిర్వహించడం జరుగుతుంది
జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్ కాలేజీలకు హాస్టల్ పర్మిషన్ లేకున్నా యదేచ్చగా లక్షల రూపాయలు తీసుకుంటూ హాస్టల్ నడిపిస్తున్నారు.
అప్లికేషన్ ఫామ్ పేరిట వెయ్యి నుండి 1500 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది
జూనియర్ కళాశాలలో హెచ్సిసి సీఈసీ ఒకేషనల్ గ్రూపులు నడపకుండా కేవలం బైపిసి ఎంపీసీ అడ్మిషన్స్ తీసుకొని నానో స్పార్క్ బ్యాచ్ గ్రూపులు అని లక్షల రూపాయలు దండుకోవడం జరుగుతుంది.
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా పెద్ద మొత్తంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు
జూనియర్ కళాశాల ప్రైవేట్ యాజమాన్యం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం బయటపెట్టకుండా విద్యార్థుల తల్లిదండ్రుల మోసం చేయడం జరుగుతుంది
క్రీడా ప్రాంగణాలు ల్యాబ్స్ లేకుండా ఒకే పర్మిషన్ తీసుకొని రెండు మూడు బిల్డింగ్స్ లలో కాలేజీ రన్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
రేకుల షెడ్లలో కాలేజీలు నడపడం వలన విద్యార్థులను తీవ్ర తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది కావున వాటిపై పర్మిషన్ రద్దు చేయాలని నిరు పేద విద్యార్థులకు న్యాయం చేసి ఫీజుల నియంత్రణ చేయాలని తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న రాష్ట్ర కార్యదర్శి కమల నరేష్ జిల్లా కోఆర్డినేటర్ కిషోర్ సురేందర్ ప్రవీణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Jul 16 2024, 09:29