నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుచేయకుంటే బిజెపి ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తాం:PYL జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్
నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుచేయకుంటే బిజెపి ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తాంYL జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్
తెలంగాణలో జూన్ 4 మంగళవారం విడుదలైన నీట్ యూజీ 2024 ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయని,67 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును సాధించారని నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఎన్.టి.ఎ)ప్రకటించింది.
ఈ సందర్బంగా ప్రగతిశీల యువజన సంఘం PYL జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ దీనిలో 8 మంది విద్యార్థులు ఒకే సెంటర్ కు చెందిన వాళ్లు ఉండడం గమనార్హం. అదేవిధంగా పరీక్షలో
కొంతమంది విద్యార్థులు 718,719 మార్కులు సాధించారు. నీట్ పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, అదేవిధంగా తప్పుడు సమాధానికి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 720 పూర్తి మార్కులు సాధించిన విద్యార్థులు 68 మంది ఉన్నప్పుడు దాని తర్వాత వచ్చే ర్యాంకుల విద్యార్థులు వారి పూర్తి స్కోరు ఒక ప్రశ్నకు సమాధానం అసలే ఇవ్వకపోతే 716 మార్కులు సాధించి ఉండాలి. లేదా ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇస్తే 715 మార్క్ లు వచ్చి ఉండాలి.
కానీ తర్వాతి ర్యాంకులలో వచ్చిన విద్యార్థులు 719,718 మార్కులు సాధించారని ఎన్.టి.ఎ ప్రకటించిన ఫలితాలల్లో వెళ్లడవుతుంది. అంటే మార్కుల ప్రకటనలో ఎన్.టి.ఎ డొల్లతనాన్ని తెలియజేస్తుంది.
పరీక్ష నిర్వహణ సమయంలో సమయం కోల్పోయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులను కలిపామని అందుకే 719, 718 మార్కులు కూడా రావచ్చు అని ఎన్.టి.ఎ ప్రకటించింది. కానీ దేని ఆధారంగా, ఏ మెథడ్స్ ను ఉపయోగించి గ్రేస్ మార్కులు ఇచ్చారో స్పష్టత లేదు.
దేశవ్యాప్తంగా విద్యార్థులు నేడు ఒకే సెంటర్ నుండి 68 మంది టాపర్లు ఎందుకు ఉన్నారు, పాట్నా ,గుజరాత్ ఇంకా అనేక ప్రాంతాల్లో పేపర్ లీక్ అయిందని విద్యార్థులు,తల్లిదండ్రులు ఆందోళన గురవుతున్నారు. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద పరీక్ష స్కామ్ గా మారింది. ఈ స్కామ్ వల్ల డాక్టర్ చదువుదామనే లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది.
ఎన్.టి.ఎ నిర్వహించిన అన్ని పరీక్షలు ఇలాగే ఉంటున్నాయి. గత సంవత్సరం సి.యు.ఈ.టి పీ.జీ ప్రవేశాల ప్రక్రియలో కూడా ఎన్.టి.ఎ ఇలానే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.
దేశంలో వివిధ యూనివర్సిటీలకు ఒకే పరీక్ష విధానం పెట్టడం సరైనది కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వివిధ పరీక్షలను సెంట్రలైజేషన్ చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్.టి.ఎ)ను తీసుకొచ్చింది. ఇది నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ప్రవేశ పరీక్షలన్నీ సెంట్రలైజేషన్ చేయడంలో భాగం. దీని ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పేద, బడుగు ,బలహీన వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. దేశవ్యాప్తంగా వస్తున్న విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని పరీక్షను వెంటనే రద్దుచేసి తిరిగి నిర్వహించాలని ప్రగశీల యువజన సంఘం PYL జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో నూతనంగా ఎన్నికైన బిజెపి ఎం.పి, కేంద్ర మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇర్ప జయలక్ష్మి కొరసా నందిని సబ్కా చందు తదితరులు పాల్గొన్నారు.
Jul 12 2024, 19:56